Begin typing your search above and press return to search.
తని ఒరువన్ కి.. చెర్రీనే ఫిక్స్ చేశాడు
By: Tupaki Desk | 5 Oct 2015 9:30 AM GMTజయం రవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వం వహించిన తని ఒరువన్ తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని రామ్ చరణ్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి రేసుగుర్రం ఫేం సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తారని ఇటీవలి కాలంలో ప్రచారమైంది. ఆ విషయాన్ని ఇప్పుడు డి.వి.వి.దానయ్య అధికారికంగా కన్ఫమ్ చేసేశారు. మరిన్ని వివరాల్ని బ్రూస్ లీ రిలీజ్ తర్వాత తెలియజేస్తామని దానయ్య చెప్పారు.
వాస్తవానికి ఈ రీమేక్ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించాలని భావించారు. చరణ్ కి ఆ విషయాన్ని మోహన్ రాజా ముందే చెప్పారు. అయితే చరణ్ మాత్రం సురేందర్ రెడ్డి వైపు మొగ్గు చూపించాడు. అప్పటికే రేసుగుర్రం సక్సెస్ తర్వాత సురేందర్ రెడ్డితో ఓ సినిమా చేస్తానని మాటిచ్చాడు చరణ్. అందుకే సూరిని ఫైనల్ చేయాల్సొచ్చింది. తన దర్శకుడిని తనే నిర్ణయించాడు చరణ్. తని ఒరువన్ రీమేక్ ని డి.వి.వి.దానయ్య మెగా సూపర్ గుడ్ ఫిలింస్ నిర్మాతల్లో ఒకరైన ఎన్.వి.ప్రసాద్ తో కలిసి నిర్మించనున్నారు. ఆ మేరకు నిర్మాతలు ఈ రీమేక్ విషయంలో చొరవ చూపించారు. దర్శకుడి విషయం మాత్రం చెర్రీకే వదిలేశారన్నమాట.
అయితే మాతృక దర్శకుడు మోహన్ రాజా తని ఒరువన్ హిందీ రీమేక్ కి దర్శకత్వం వహించేందుకు రెడీ అవుతున్నారన్న సమాచారం ఉంది. అక్కడ సల్మాన్ ఖాన్ హీరోగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని ఇటీవల వార్తలొచ్చాయి.