Begin typing your search above and press return to search.

భార్య సోద‌రీమ‌ణుల‌తో చెర్రీ సంక్రాంతి సెల‌బ్రేష‌న్

By:  Tupaki Desk   |   15 Jan 2021 8:36 AM GMT
భార్య సోద‌రీమ‌ణుల‌తో చెర్రీ సంక్రాంతి సెల‌బ్రేష‌న్
X
సంక్రాంతి పండుగ అంటే ఇంటిల్లిపాదీ సంబ‌రంగా జ‌రుపుకునే పండ‌గ‌. ప్ర‌తియేటా ఈ సాంప్ర‌దాయాన్ని మెగాఫ్యామిలీ అనుస‌రిస్తోంది. మెగాస్టార్ ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ ఓ వేదికపై వేడుక‌గా పండ‌గ‌ను సెల‌బ్రేట్ చేసుకోవ‌డం చూస్తున్న‌దే.

ఈసారి కూడా మెగా-అల్లు వేడుక‌గా సంక్రాంతి సంబ‌రం సాగింది. మెగా కోడ‌లు ఉపాస‌న‌.. అల్లు కోడ‌లు స్నేహా ఈ వేడుక‌ల్ని వైభ‌వంగా న‌డిపించారు. ఇదిగో లేటెస్టుగా రామ్ చ‌ర‌ణ్ ఉన్న గ్రూప్ ఫోటో ఒక‌టి బ‌య‌ట‌ప‌డింది. ఇందులో భార్య‌.. సిస్ట‌ర్స్ తో అత‌డు క‌నిపించారు. చ‌ర‌ణ్ ఎప్ప‌టిలానే అయ్య‌ప్ప మాల‌ను ధ‌రించారు. ప్రతియేటా చెర్రీ అయ్య‌ప్ప పూజలో ఉంటున్న‌ట్టే ఈ ఏడాది కూడా దానిని కొన‌సాగిస్తున్నారు.

ఉపాస‌న .. సుస్మిత‌.. శ్రీ‌జ‌.. కొత్త పెళ్లికూతురు నిహారిక .. వీళ్ల‌తో పాటు ఇత‌ర కుటుంబ సభ్యులు ఈ ఫోటోలో ఉన్నారు. అయితే ఈ క‌ల‌ర్ ఫుల్ స్నాప్ లో మెగాస్టార్ చిరంజీవి మిస్స‌య్యారు. ఆయ‌న ప్ర‌స్తుతం ఆచార్య చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిన‌దే.