Begin typing your search above and press return to search.

వామ్మో.. బ్రూస్‌ లీ చుట్టూ సెంటిమెంట్లే

By:  Tupaki Desk   |   13 Oct 2015 3:30 AM GMT
వామ్మో.. బ్రూస్‌ లీ చుట్టూ సెంటిమెంట్లే
X
చాలా సినిమాల్లో క్యాస్టింగ్‌ ఎలా ఉంటుందంటే.. ఆ సినిమాలో వారు చేసి హిట్టు కొట్టారు కాబట్టి.. మా సినిమాలో కూడా చేసి హిట్టు కొట్టండి అన్నట్లుంటుంది. అయితే అన్నిసార్లూ అలా హిట్టవ్వాలని లేదు.

ఇప్పటివరకు చరణ్‌-చిరంజీవి ఇద్దరూ కలసి ఒక్కసారి మాత్రమే తెరపై కనిపించారు. ఆ సినిమా మగధీర. ఇండస్ర్టీ హిట్‌ అయ్యింది. అందుకే ఇప్పుడు చరణ్‌-చిరంజీవి మరోసారి కనిపిస్తే అదే రేంజు హిట్టవుతుందని ఒక సెంటిమెంట్‌. ఇకపోతే అందాల అత్త నదియా.. పవన్‌ తో అత్తారింటికి దారేది.. ప్రభాస్‌ తో మిర్చి.. చేయగానే హిట్‌ అంతే. అందుకే ఆమె రామ్‌ చరణ్‌ సినిమాలో నటిస్తోందంటే.. ఖచ్చితంగా హిట్‌ అంటున్నారు అభిమానులు. మూడవ సెంటిమెంట్‌ ఇంకోటి ఉందండోయ్‌. ఇప్పటివరకు ఎవరైనా ఒక ఫ్లాపు తీసిన డైరక్టర్‌ తో చరణ్‌ పనిచేస్తే.. ఆ సినిమా మాత్రం ఎబోవ్‌ యావరేజే. వినాయక్‌ తో నాయక్‌ - సంపత్‌ నందితో రచ్చ - కృష్ణవంశీతో గోవిందుడు అందరివాడేలే.. అలాగే వచ్చాయ్‌. సర్లేండి.. ఇలా సెంటిమెంట్లు చెప్పుకుంటూ పోతే నెగెటివ్‌ లు కూడా ఉన్నాయ్‌.

ఆరేంజ్‌ సినిమా ఆడియో చరణ్‌ కెరియర్‌ లోనే సూపర్‌ హిట్‌. ఆ తరువాత ఆ రేంజ్‌ హిట్టు కొట్టిన ఆడియో అంటే అది తమన్‌ బాబు అందించి ''బ్రూస్‌ లీ'' ఆడియో అనే చెప్పాలి. మరి ఇక్కడ కూడా ఒక సెంటిమెంటు కనిపిస్తోంది. ఇకపోతే ఇలాంటి సెంటిమెంట్లతో అస్సలు సంబందం లేదని.. తాము మంచి సినిమాను తీశామని.. హిట్టవుతుందనే నమ్మకం ఉందని సెన్సార్‌ కార్యక్రమాలు జరుగుతున్న టైములో శ్రీను వైట్ల సన్నిహితులతో పంచుకున్నాడు. అది సంగతి.