Begin typing your search above and press return to search.
నిర్మాతలకు చరణ్ హుకుం?
By: Tupaki Desk | 6 Feb 2018 7:22 AM GMTసినిమా జయాపజయాలతో ప్రతి సారి హీరోలకు సంబంధం లేకపోయినా అది జరుపుకునే బిజినెస్ మాత్రం ఖచ్చితంగా హీరోని బట్టే ఉంటుంది. అందుకే ఇమేజ్ ని బట్టి కాంబినేషన్ కున్న క్రేజ్ ను బట్టి పంపిణిదారులు విపరీతమైన రేట్లకు కొనడం, తీరా సినిమా ఫ్లాప్ అయ్యి నష్టం వచ్చాక లబోదిబోమని అరిచి గీ పెట్టుకోవడం ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువయ్యింది అనే మాట వాస్తవం.అందుకే నిర్మాతలు హీరోలను తమ పారితోషికంలో కొంత వెనక్కు ఇవ్వమని అడిగే ట్రెండ్ కూడా మొదలుపెడుతున్నారు. అందుకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మితిమీరిన హైప్ తో ఆకాశమే హద్దుగా సినిమా ధరలను నిర్ణయిస్తున్న తన నిర్మాతలకు చాలా స్పష్టంగా ఒక డిమాండ్ ముందే చెబుతున్నాడట.
నిర్మాణ వ్యయాన్ని బట్టి - దాని మీద ఆశిస్తున్న లాభాల శాతాన్ని బట్టి అమ్మకం జరగాలే తప్ప మార్కెట్ లోనో లేక అభిమానుల్లోనో హైప్ ఉంది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకుందామనే ప్రయత్నాలు ఉంటే మానుకోమని ముందే చెప్పినట్టు టాక్. రంగస్థలానికి కూడా దీనికి మినహాయింపు ఇవ్వలేదుట. సాధారణంగా చేసే బిజినెస్ ప్రకారం కాకుండా రీజనబుల్ గా ఎవరికి నష్టం రాకుండా ఓ 20 శాతం దాకా తక్కువకే తన సినిమాను ఇచ్చేయమని చెప్పినట్టు వార్త. ఏ ఏరియా అయినా ఇది వర్తిస్తుందని - డీల్ క్లోజ్ చేసే ముందు ఎంతకు అమ్మారో వివరాలు తనకు చెప్పాలని కూడా సందేశం ఇచ్చాడట.
ఇది ఒకరకంగా మంచి ఎత్తుగడ అని చెప్పొచ్చు. సినిమాలను కొనేవాళ్ళకు రిస్క్ ఎల్లప్పుడు ఉంటుంది. హిట్ అవుతుందా ఫట్ అంటుందా అని ముందే చెప్పలేని పరిస్థితి. అలాంటప్పుడు డిస్ట్రిబ్యూటర్ల రిస్క్ తగ్గించే ప్రయత్నం చేయటం మంచిదే. రంగస్థలంపై టీం మొత్తం కాన్ఫిడెంట్ గా ఉన్నా ఇంత పోసి కొంటున్నాం అనే ఫీలింగ్ రాకుండా ఎక్కువ లాభాలు వచ్చేలా చేయటం కోసం ఇలా చేయటం మెచ్చదగించే. కాని నిర్మాత ఇలాంటి సలహాలను పెత్తనం అని ఫీల్ అయితేనే వస్తుంది చిక్కు. మార్చ్ 30న భారీ ఎత్తున విడుదల కాబోతున్న రంగస్థలం బిజినెస్ వ్యవహారాలు నడుస్తున్న టైంలో ఈ టాపిక్ రావడం ఆసక్తి రేపుతోంది