Begin typing your search above and press return to search.

డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు డాడ్ తో పీటముడి!

By:  Tupaki Desk   |   11 Feb 2019 4:32 AM GMT
డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు డాడ్ తో పీటముడి!
X
రామ్ చ‌ర‌ణ్ `విన‌య విధేయ రామ` న‌ష్టాల రిక‌వ‌రీ గురించి ఫిలింస‌ర్కిల్స్ లో ఆసక్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. 30 కోట్ల న‌ష్టాల్లో స‌గం భ‌రించేందుకు చర‌ణ్‌- దాన‌య్య‌ ప్లాన్ చేశార‌ని ప్ర‌చార‌మైంది. ద‌ర్శ‌కుడు బోయ‌పాటితో క‌లిసి త‌లో రూ.5కోట్లు వెన‌క్కి ఇవ్వాల‌ని భావిస్తే - బోయ‌పాటి ఆ ప్ర‌పోజ‌ల్ ని తిర‌స్క‌రించాడ‌ని వార్త‌లొచ్చాయి. బోయ‌పాటి- దాన‌య్య మ‌ధ్య ఘ‌ర్ష‌ణలో పెద్ద‌లు త‌ల‌దూర్చి స‌రి చేశార‌ని ముచ్చ‌టించుకున్నారు.

అదంతా అటుంచితే.. డిస్ట్రిబ్యూటర్ల న‌ష్టాల్ని వీళ్లు ఎలా రిక‌వ‌రీ చేయ‌బోతున్నారు? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. రామ్ చ‌ర‌ణ్ తిరిగి క్యాష్ రూపంలోనే రూ.5కోట్లు వెన‌క్కి ఇస్తారా? అంటే అలాంటిదేం లేద‌ట‌. చ‌ర‌ణ్ న‌టించే త‌ర్వాతి సినిమా నుంచి డిస్ట్రిబ్యూట‌ర్లు ఆ న‌ష్టాల్ని రిక‌వ‌రీ చేసుకునే ఆప్షన్ ఉంది. అయితే ఇక్క‌డే చెర్రీ ఓ కండిష‌న్‌ ని అప్ల‌య్ చేశార‌ని తెలుస్తోంది. పంపిణీదారుల‌కు రూ.5కోట్లు తిరిగి చెల్లించేందుకు ఓకే. అయితే కండిష‌న్స్ అప్ల‌య్ అని పంపిణీదారుల‌కు చెప్పార‌ట‌.

డాడ్ చిరంజీవి - త్రివిక్ర‌మ్ మూవీ రైట్స్ లో రిక‌వ‌రీ చేసుకునే ఆప్ష‌న్ ఇచ్చార‌ని తెలుస్తోంది. అయితే.. ఇదేం లాజిక్? చెర్రీ అస‌లు లాజిక్ మిస్స‌య్యారా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. చిరు న‌టిస్తున్న `సైరా- న‌ర‌సింహారెడ్డి` రిలీజ‌య్యాక కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తారు. ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్ తో సినిమా ఉంటుంది. ఈలోగానే త్రివిక్ర‌మ్ క్యూలో బ‌న్ని - వెంక‌టేష్ ఉన్నారు. ఆ ఇద్ద‌రితో సినిమాలు పూర్త‌య్యాకే చిరుతో సినిమా చేస్తారు. ఈ క‌మిట్ మెంట్లు పూర్త‌వ్వాలంటే ఎంత కాలం ప‌డుతుందో? చిరు- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ సెట్స్ కెళ్లేట‌ప్ప‌టికే మూడు నాలుగేళ్లు ప‌ట్టొచ్చు!! అని విశ్లేషిస్తున్నారు. మ‌రి అప్ప‌టివ‌ర‌కూ `విన‌య విధేయ రామ` న‌ష్టాల భ‌ర్తీ వీలు ప‌డ‌న‌ట్టేనా? అన్న లాజిక్ ని విశ్లేషిస్తున్నారు. మ‌రో కోణంలో చూస్తే రామ్ చ‌ర‌ణ్ - దాన‌య్య ప్ర‌స్తుతం `ఆర్.ఆర్.ఆర్‌` చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాతో డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు వెసులుబాటు క‌ల్పించే అవకాశం ఉన్నా చ‌ర‌ణ్ ఆ కండిష‌న్ ఎందుకు అప్ల‌య్ చేస్తున్నారు? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ ప్ర‌చారంలో వాస్త‌వం ఎంతో చ‌ర‌ణ్ కానీ - దాన‌య్య కానీ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.