Begin typing your search above and press return to search.
మెగాపవర్ స్టార్ ఫాదర్స్ డే స్పెషల్ పోస్ట్..!
By: Tupaki Desk | 20 Jun 2021 2:39 PM GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కొడుకు మెగాపవర్ స్టార్ రాంచరణ్ బంధం గురించి మెగా అభిమానులకు స్పెషల్ అభిమానం ఉంది. ఎందుకంటే వీరిద్దరూ ఎప్పుడు ఓ తండ్రి కొడుకులా కాకుండా ఫ్రెండ్స్ లా కనిపించి హ్యాపీ చేస్తుంటారు. అలాగే ఇద్దరు ఒక స్క్రీన్ పై కనిపిస్తే మాత్రం అంతే. మెగాస్టార్ రాంచరణ్ ఇద్దరు కలిసి ఇదివరకు పలు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ ఏ సినిమాలో కూడా ఐదు నిమిషాలకు మించి స్క్రీన్ ప్రెసన్స్ ఉండదు. కానీ ఈసారి అలా కాదు. ఏకంగా ఇద్దరూ కలిసి ఓ రకంగా మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారనే చెప్పాలి.
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో ఆచార్య అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాంచరణ్ కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఆల్రెడీ తన వెర్షన్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో తండ్రికొడుకులా కాకుండా ఓ నాయకుడు ఓ విద్యార్ధిలా కనిపిస్తారని టాక్. అయితే మెగాస్టార్ - మెగాపవర్ స్టార్ ఇద్దరూ కూడా ఎలాంటి స్పెషల్ డే వచ్చినా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు ఖచ్చితంగా పోస్ట్ చేస్తారు. తాజాగా ఈరోజు ఫాదర్స్ డే సందర్బంగా రాంచరణ్ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టాడు.
ఆ పోస్ట్ లో మెగాస్టార్ తో ఓ ఫొటోకు పోజిచ్చాడు. అందులో ఇద్దరు మెగాహీరోలు కూడా బ్లాక్ అండ్ బ్లాక్ ధరించడం మనం చూడవచ్చు. "నీతో ప్రతి నిమిషం ఓ నిధిలాంటిదే. హ్యాపీ ఫాదర్స్ డే!!" అంటూ రాంచరణ్ తండ్రిని ఉద్దేశించి కాప్షన్ జోడించాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో మెగా పోస్ట్ లా వైరల్ అవుతోంది. అలాగే వీరిద్దరూ కూడా ఇప్పటికి హీరోలుగా కంటిన్యూ అవుతున్నందుకు మెగాఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ ఆచార్యతో పాటు లూసిఫర్ రీమేక్ లో నటిస్తున్నాడు. అలాగే రాంచరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు డైరెక్టర్ శంకర్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ రెండు కూడా పాన్ ఇండియా రేంజిలో రిలీజ్ కాబోతున్నాయి.