Begin typing your search above and press return to search.

షాక్‌: `ఆచార్య` సెట్లో మెగాపవర్ స‌ర్క్యూట్

By:  Tupaki Desk   |   27 Dec 2020 7:30 AM GMT
షాక్‌: `ఆచార్య` సెట్లో మెగాపవర్ స‌ర్క్యూట్
X
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య` శ‌ర‌వేగంగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌హ‌మ్మారీ బ్రేకుల న‌డుమ ఆల‌స్యంగా మొద‌ల‌వ్వ‌డంతో కొర‌టాల రెట్టించిన క‌సితో ప‌ని చేస్తున్నారు. చిరంజీవి- కాజ‌ల్ జంట స‌హా కీల‌క తారాగ‌ణంపై చిత్రీక‌ర‌ణ సాగిస్తున్నారు.

ఇటీవ‌లే సెట్లోకి కాజ‌ల్ హ‌బ్బీ గౌత‌మ్ కిచ్లు విచ్చేసి సంద‌డి చేశారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి అండ్ టీమ్ గ్రీట్ అండ్ మీట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యింది. తాజాగా ఆచార్య సెట్లోకి అనుకోని అతిథి వ‌చ్చి స‌ర్ ప్రైజ్ చేశారు.

ఇంత‌కీ ఎవ‌రా అతిథి? అంటే .. రామ్ చ‌ర‌ణ్‌. `ఆచార్య`లో 40 నిమిషాల నిడివితో కీల‌క పాత్ర‌లో న‌టించి ట్రీటివ్వ‌నున్న చెర్రీ అప్పుడే షూటింగుకి జాయిన‌య్యారా? అన్న‌ది స‌స్పెన్స్ ఇంకా. నిజానికి ఆర్.ఆర్.ఆర్ లో త‌న పార్ట్ పూర్తి చేయ‌కుండా చెర్రీ జాయిన‌య్యే సీన్ అయితే లేదు. అయితే ఇప్పుడిలా నిర్మాత హోదాలోనే చ‌ర‌ణ్ ఆచార్య సెట్స్ కి విచ్చేశారని భావించాల్సి ఉంటుంది. అయినా చిత్ర‌ నిర్మాత‌ను సెట్స్ లోకి రానివ్వ‌రా? ప‌్ర‌స్తుతం చ‌ర‌ణ్ స‌ర‌స‌న నాయిక‌ను ఫైన‌ల్ చేయాల్సి ఉండ‌గా నిర్మాత‌లు ఆ ప‌నిలోనూ బిజీగా ఉన్నారు. పూజా హెగ్డేని ఆల్మోస్ట్ ఖాయం చేశార‌న్న గుస‌గుస‌లు తాజాగా తెర‌పైకి వ‌చ్చాయి. కాస్త ఆగితే అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుందేమో.