Begin typing your search above and press return to search.

కొణిదెల బ్యానర్ అందుకే పెట్టాం

By:  Tupaki Desk   |   22 Aug 2016 4:37 PM GMT
కొణిదెల బ్యానర్ అందుకే పెట్టాం
X
''అభిమానులు యాక్టివిటీస్ నుండి పూజల వరకు చూస్తుంటే.. అసలు మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యలం మేమా లేకపోతే వారా అని అనిపిస్తుంటుంది'' అంటూ సెలవిచ్చాడు రామ్‌ చరణ్‌. ''ఖైదీ నెం 150'' సినిమా తాలూకు మోషన్ పోస్టర్ లాంచ్ వేడుకలో మాట్లాడుతూ.. చాలా హృదయపూర్వంగా ఎన్నో విషయాలను చెప్పాడు చరణ్‌.

''30 సంవత్సరాలుగా నాన్నగారే మీతో పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాని తొలిసారిగా నాకూ - బన్నీకి - తేజుకు - వరుణ్‌ - శిరీష్‌ లకు అవకాశం ఇచ్చారు'' అంటూ చెప్పాడు చరణ్‌. మా స్థాయికి మించి మీరు ప్రేమాభిమానాలు చూపిస్తుంటారు.. అందుకే నీ నుండి మేం నేర్చుకుంటున్నాం మా నాన్నగారిని ఎలా అభిమానించాలనే విషయం.. అని కూడా అన్నాడు చరణ్‌.

''ఎప్పుడైనా ఒక చిన్న సినిమా నాకు ప్రొడ్యూస్ చేయాలని ఉంది అంటూ మా అమ్మ చెప్పింది. అప్పుడు నేను మా మావయ్య (అల్లు అరవింద్)తో చెప్పి.. అమ్మ పేరు మీద చేద్దాం అని చెప్పి.. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పైన సినిమా చేయాలని డిసైడయ్యాం. మా నాన్నగారే మా ఫస్టు హీరో అవ్వడం మా అదృష్టం'' అని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ గురించి చెప్పాడు రామ్‌ చరణ్‌.

అయితే చరణ్‌ మాట్లాడుతుండగా.. ''వుయ్ వాంట్ మెగాస్టార్'' అనే అరుపులు అభిమానుల నుండి వినిపిస్తూనే ఉన్నాయి. అప్పుడు స్టేజీపైకి సడన్ గా వచ్చిన అల్లు అర్జున్.. ''మీ ఎదురుగా ఉన్నదే మెగాస్టార్.. మళ్లీ మెగాస్టార్ అని అరుస్తారేంటి??'' అన్నాడు. ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. అయితే వెంటనే అందుకున్న చరణ్‌.. ''మనకంత సీన్‌ లేదులే'' అంటూ నవ్వేశాడు.