Begin typing your search above and press return to search.

ధృవ ఈవెంట్: చరణ్‌.. లా ఆఫ్‌ ఎట్రాక్షన్

By:  Tupaki Desk   |   5 Dec 2016 3:54 AM GMT
ధృవ ఈవెంట్: చరణ్‌.. లా ఆఫ్‌ ఎట్రాక్షన్
X
ఆదివారం సాయంత్రం జరిగిన ''ధృవ'' ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఓ రేంజులో జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాపై ఉన్న అంచనాలకు అనుగుణంగా.. అభిమానులను అలరించడానికి ఇంతవరకు ఒక్కటంటే ఒక్క ఫంక్షన్ కూడా జరగలదు. అందుకే ఈ ఈవెంట్ పై చాలా హైప్ ఉంది. ఇకపోతే ఈ ఈవెంట్లో రామ్ చరణ్‌ ఏం మాట్లాడతాడో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

''పైనున్న దేవుడు మనకు కనిపించడు కాని.. క్రింద ఉన్న దేవుడైతే మీలాగే ఉంటాడేమో'' అంటూ అభిమానులను ఉద్దేశించి చరణ్‌ తొలుత చేసిన కామెంట్లు ఉర్రూతలూగించాయి. అలాగే సభకు విచ్చేసిన డైనమిక్ లీడర్ అండ్ తన స్నేహితుడు 'రామ్‌' గురించి రామ్ చరణ్‌ ప్రస్తావించగానే సభ ఒక్కసారిగా హోరెత్తిపోయింది.

ఆ తరువాత చరణ్‌ మాట్లాడుతూ.. ''అందరం అన్ని సినిమాలూ కష్టపడే చేస్తాం. ఇండస్ర్టీలో ఉన్న ప్రతీ యాక్టర్ అంతే. అభిమానులను అలరించాడనికి ఖచ్చితంగా కష్టపడాలి. కష్టపడితేనే బాగుంటుంది. ఈ సినిమా కోసం కొత్తగా కష్టపడిందేం లేదు. ఇలా కష్టపడకపోతే అసలు అర్ధమే లేదు'' అంటూ ఫిలసాఫికల్ టచ్ ఇచ్చాడు చరణ్‌. ఎందుకంటే దాదాపు గెస్టులు అందరూ చరణ్‌ సిక్స్ ప్యాక్ కష్టం గురించి పొగుడుతూనే ఉన్నారు మరి. ''ఏ ఇండస్ర్టీలోనైనా ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది. డబ్బిస్తే డబ్బు వస్తుంది. భోజనం పెడితే మనకు లోటు లేకుండా ఉంటుంది. దీనినే లా ఆఫ్‌ ఎట్రాక్షన్ అంటారు. కాని ఫిలిం ఇండస్ర్టీలో అభిమానులు మాత్రం.. వారిని ఎంటర్టయిన్ చేస్తే వారు తిరిగి ఎంటర్టయిన్ చేయరు. కాని పేరు.. డబ్బు.. రెస్పక్ట్ వంటివి ఇస్తారు. అందుకే ఈ అభిమానులకు ఋణ పడి ఉంటాం'' అంటూ సెలవిచ్చాడు.

ఇక ధృవ కోసం పడిన కష్టం గురించి చెబుతూ.. ''జనవరిలో చిరంజీవి గారి 150వ సినిమా వస్తోంది. ఆయన లేని టైములో మేం ఎలా చేసినా పర్లేదు. కాని ఇప్పుడు ఆయన వస్తున్నారు కాబట్టి.. మేం ఇంకాస్త జాగ్రత్తగా కష్టపడుతున్నాం. లేకపోతే ఆయన బెత్తం పట్టుకుని వెనకే వస్తారు. ఆ స్టాండర్డ్స్ మ్యాచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం'' అన్నాడు చెర్రీ.

దర్శకుడు సురేందర్ రెడ్డి గురించి చరణ్‌ ఏమన్నాడంటే.. ''ఈ రీమేక్ చేయాలని అనుకున్నప్పుడు.. సురేందర్ రెడ్డి గారికి చెప్పాను. ముందు ఆయన ఆస్తకి కనబరచలేదు. ఏ దర్శకుడైనా కూడా తన సొంత కథతో సినిమా చేయాలని అనుకుంటాడు. కాని ఇలా రీమేక్ కతతో చేయడానికి ఒప్పుకున్నందుకు మనందరం ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. తమిళ సినిమాకన్నా బాగా తీసి ఇచ్చినందుకు థ్యాంక్స్ సురేందర్ రెడ్డి''

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ 'పరేషానురా' సాంగ్ అందాల గురించి చెబుతూ.. ''ఆ పాటలో నేనొక గెస్ట్ క్యారెక్టర్. రకుల్ చాలా అందంగా కనిపిస్తుంది. బహుశా ఫ్యాన్స్ అందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీసినట్లున్నాడు'' అంటూ ఛమత్కరించాడు. అలాగే అరవింద్ స్వామి అండ్ ఇతర నటులకు కూడా థ్యాంక్స్ చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/