Begin typing your search above and press return to search.

తొమ్మిదేళ్ళ తరువాత అందుకే వచ్చా

By:  Tupaki Desk   |   11 Sept 2017 9:40 AM IST
తొమ్మిదేళ్ళ తరువాత అందుకే వచ్చా
X
రైటర్ గా విజయేంద్ర ప్రసాద్ సాధించిన ఘన విజయాలు అందరికీ తెలిసినవే. ఫ్లాప్ ఎరుగని దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమాలన్నింటికీ కథలు అందించింది విజయేంద్ర ప్రసాద్. లేటెస్ట్ గా హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకున్నవి బాహుబలి - సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయీజాన్ సినిమాలే. ఈ రెండింటికీ కథా రచయిత విజయేంద్ర ప్రసాదే. ఆయన స్వయంగా కథ రాసి దర్శక బాధ్యతలు వహించిన శ్రీవల్లి సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. శ్రీవల్లి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మెగా హీరో రామ్ చరణ్ హాజరై విజయేంద్ర ప్రసాద్ సినిమాలకు ప్రమోషనే అక్కర్లేదని.. ఎందుకంటే ఆయన పేరుంటే చాలని స్టేట్ మెంట్ ఇచ్చేశాడు.

ఈ ఫంక్షన్ లోతండ్రీ కొడుకులైన విజయేంద్ర ప్రసాద్ - రాజమౌళిలపై రామ్ చరణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. మగధీర సినిమా తర్వాత మళ్లీ విజయేంద్ర ప్రసాద్ తో కలిసి ఒక వేదికపై నిల్చునే అవకాశం లభించందంటూ తనకు మగధీర లాంటి మరిచిపోలేని విజయాన్నందించిన వారిద్దరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పడానికి ఇక్కడికొచ్చానంటూ చెప్పుకొచ్చాడు. ఇది తొమ్మిదేళ్లగా తన మనసులో ఉన్న మాట అని.. ఇది చెప్పడానికి ఓ వేదిక కోసం చూస్తున్నానని అన్న రామ్ చరణ్ ఎందరో హీరోలకు మరిచిపోలేని విజయాన్ని అందించిన హిట్ కాంబినేషన్ విజయేంద్ర ప్రసాద్ - రాజమౌళిదని గుర్తు చేశాడు. టోటల్ ఇండియాలోనే ఇన్ని ఘన విజయాలు సాధించిన తండ్రి కొడుకుల కాంబినేషన్ లేదన్నాడు.

హాలీవుడ్ లో వచ్చే సైన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెలుగులో సినిమాలు రాలేదని... అలాంటి కథతో శ్రీవల్లి సినిమా తీయడం చాలా విశేషమని రామ్ చరణ్ ప్రశంసించాడు. తనకు ప్రస్తుతం ఆరోగ్యం సహకరించకపోయినా విజయేంద్ర ప్రసాద్ కోసం అండ్ తన అభిమానుల కోసం ఇక్కడకు వచ్చానంటూ ఫ్యాన్స్లో జోష్ నింపాడు.