Begin typing your search above and press return to search.

కొణిదెల నిర్మాత భావుక‌త‌కు అంత‌రార్థం ఇదీ

By:  Tupaki Desk   |   23 Sep 2019 8:26 AM GMT
కొణిదెల నిర్మాత భావుక‌త‌కు అంత‌రార్థం ఇదీ
X
ఆర్టిస్టు స‌హ‌క‌రించ‌క‌పోతే ఏ నిర్మాత‌కు అయినా ఆ టెన్ష‌న్ వేరేగా ఉంటుంది. పైగా భారీ పాన్ ఇండియ‌న్ సినిమాల‌కు హ్యాండిస్తే అంతే సంగ‌తి. అయితే బ‌డా నిర్మాణ సంస్థ‌ల విష‌యంలో అలా జ‌రిగేందుకు ఆస్కారం లేదు. స‌రిగా పారితోషికాలు అంద‌జేస్తారు కాబ‌ట్టి ఆర్టిస్టులు అంతే నిబ‌ద్ధ‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తారు. అలాగే టెక్నీషియ‌న్లు ప‌నికి హ్యాండిచ్చే అవ‌కాశం లేదు. సైరా విష‌యంలో నిర్మాత రామ్ చ‌ర‌ణ్ కి ఎలాంటి టెన్ష‌న్ ఎదురు కాలేదా? అంటే.. ప్రాజెక్టు పూర్త‌య్యేవర‌కూ త‌న‌లో ఉన్న టెన్ష‌న్ ని అలానే దాచుకుని అంద‌రినీ జాగ్ర‌త్త‌గానే మ్యానేజ్ చేశార‌ని అర్థ‌మ‌వుతోంది.

సైరా ప్రీరిలీజ్ వేదిక‌పై సీనియ‌ర్ హ‌రో జ‌గ‌ప‌తి బాబు ఓ మాట‌న్నారు. `నేను షూటింగుకి ఓ రోజు ఆల‌స్యంగా వెళ్లాను. అయితే ఒక‌రోజు ముందే సెట్స్ కి వ‌చ్చిన రామ్ చ‌ర‌ణ్ ఒక మాట చెప్పార‌ట‌. సెట్స్ లో ప్ర‌తి ఆర్టిస్టును స్టార్ లానే చూసుకోవాల‌ని చెప్పి వెళ్లారు అని తెలిసింది.. అన్నారు. దీనిని బ‌ట్టి చ‌ర‌ణ్ ప్ర‌తి చిన్న ఆర్టిస్టు విష‌యంలోనూ ఎంతగా కేర్ తీసుకున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. సినిమా పూర్త‌య్యేవ‌ర‌కూ అదొక య‌జ్ఞం లాంటిది. ఏది తేడా కొట్టినా కోట్ల‌లో న‌ష్టం. అందుకే ఈ జాగ్ర‌త్త‌. ఆర్టిస్టుకు స‌న్నాయి నొక్కులు అని అర్థం చేసుకోవ‌చ్చు.

`సైరా` వేదిక‌పై రామ్ చరణ్ మాట్లాడుతూ అంద‌రికీ పేరు పేరునా కృత‌జ్ఞ‌త‌లు చెప్పింది ఇందుకే. కొన్ని మాటలు నా లోపలి భావాలను తెలియజెప్పలేవు.. నేను ఎంత థాంక్స్ చెప్పినా ఈ స్టేజ్ పై చెప్పిన కొన్ని మాటలు నా లోపలి భావాలను తెలియ జెప్పలేవు అంటూ న‌ర్మ‌గ‌ర్భంగా మాట్లాడారు. 200 రోజులు షూటింగ్‌ చేశాం.. ప్రతీ రోజు వారికి నేను కృతజ్ఞతలు చెబుతూనే ఉన్నాను. నాన్న గారి డ్రీం ప్రాజెక్టు అయిన ఈ సినిమా వీళ్ళంతా లేకుంటే సాధ్యమయ్యేది కాదు అని చ‌ర‌ణ్ అన్నారు.

నయనతార-తమన్నా- జగపతిబాబు- విజయ్ సేతుపతి ఇలా నటీనటులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పిన చెర్రీ.. నాన్న గారిని - బాబాయ్‌ ని ఎక్కువ సేపు నిల్చోబెట్టలేను అని అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. అయితే ఇంత పెద్ద వేడుక‌కు హ్యాండిచ్చిన న‌య‌న‌తార‌- త‌మ‌న్నాల‌కు కూడా చ‌ర‌ణ్ మ‌రోసారి కృత‌జ్ఞ‌తలు చెప్పారు మ‌రి. ఆర్టిస్టుల‌కు ఒక నిర్మాత‌గా ఆయ‌నిచ్చే గౌర‌వం బాగానే ఉంది కానీ.. మ‌రి వీళ్లు ఎందుక‌ని ఈవెంట్ కి రాలేదో?