Begin typing your search above and press return to search.
'తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే..' అంటున్న రాంచరణ్
By: Tupaki Desk | 22 March 2020 3:30 AM GMTప్రస్తుతం టాలీవుడ్ లో మెగాస్టార్ సినిమా గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చలు నడుస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ 152వ చిత్రంగా రూపొందుతుంది 'ఆచార్య'. సామాన్యంగా కొరటాల శివ ఏ హీరో తో తీసినా ఆ సినిమాపై అంచనాలు భారీగానే ఉంటాయి. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి తో సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించడం కష్టం. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆచార్య సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ కొరటాల.
తాజా కథనాల ప్రకారం.. ఆచార్య సినిమాలో మరో కీలక పాత్ర కోసం రాంచరణ్ ను సంప్రదించాడట డైరెక్టర్. అయితే రాంచరణ్ ఆల్రెడీ ఈ సినిమాకు ఒక నిర్మాత. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే.. రాంచరణ్ నిర్మిస్తున్న సినిమాలో రాంచరణ్ నటించడానికే భారీ పారితోషికం అడుగుతున్నాడట. రాంచరణ్ అయితే ఆచార్య సినిమాలో నటించడానికి 30కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. రాంచరణ్ ఎంత సొంత నిర్మాణ సినిమా అయినా.. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే.. అనే సామెతను ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. అంతేగాక దర్శక నిర్మాతలు రాంచరణ్ కు రోజుకు కోటి రూపాయలు చెల్లించనున్నారని వార్త ప్రస్తుతం నెట్టింట హల్చల్ అవుతుంది. మరి సొంత సినిమాకే కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడనే వార్త పై రాంచరణ్ ఎలా స్పందించనున్నాడో వేచి చూడాలి..