Begin typing your search above and press return to search.

భార్యకు వీకెండ్ ఇచ్చేసిన చరణ్

By:  Tupaki Desk   |   17 April 2017 5:00 AM GMT
భార్యకు వీకెండ్ ఇచ్చేసిన చరణ్
X
రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎండలు మండుతున్నా సరే.. రాజమండ్రి పరిసరాల్లో మూవీ షూటింగ్ జరుగుతూనే ఉంది. సుకుమార్ దర్శకత్వం కాబట్టి.. జెట్ స్పీడ్ లో జరుగుతుందని చెప్పడం కాసింత కష్టమైన విషయమే.

అయితే.. చెర్రీని మిస్ అవుతున్నానంటూ.. భార్య ఉపాసన సోషల్ మీడియా ద్వారా చెప్పింది. 'ఒంటరి సాయంత్రం. మిస్టర్ సి ని మిస్ అవుతున్నాను. రాజమండ్రి వేడిలోనే బిజీ షూటింగ్ షెడ్యూల్స్' అంటూ తను ఒంటరిగా ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేసింది ఉపాసన. ఈ పోస్ట్ చూసి బయల్దేరాడో.. ముందుగానే ప్లాన్ చేసుకున్నాడో కానీ.. ఆ సాయంత్రానికల్లా హైద్రాబాద్ లో వాలిపోయాడు చెర్రీ. భార్య ఉపాసనకు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చేశాడు. అలాగే మళ్లీ సోమవారం ఉదయానికల్లా రాజమండ్రిలో వాలిపోవడం విశేషం. ఈ వీకెండ్ వరకు భార్యకు కేటాయించిన మెగా పవర్ స్టార్.. వెంటనే సుక్కు సినిమాపై దృష్టి పెట్టేశాడు.

మరోవైపు ఈ మూవీ థీమ్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకూ సుకుమార్ డీల్ చేసిన సబ్జెక్టులన్నీ అర్బన్ లవ్ స్టోరీలే కాగా.. మొదటిసారిగా గ్రామీణ నేపథ్యంతో సినిమా తీస్తున్నాడు. చెర్రీ-సుక్కుల కాంబినేషన్ కూడా ఇదే తొలిసారి కావడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/