Begin typing your search above and press return to search.
చరణ్ డ్రాప్ అయ్యి సేఫ్ అయ్యాడు!!
By: Tupaki Desk | 30 Sep 2018 1:30 AM GMTనవాబ్ గురించి ఎంత పాజిటివ్ టాక్ వినిపిస్తున్నప్పటికీ అది ఇలాంటి సినిమాలను ప్రత్యేకంగా ఇష్టపడే ప్రేక్షకులకు తప్ప సాధారణ ఆడియన్స్ కు అంతగా కనెక్ట్ కావడం లేదన్నది నిజం. తమిళ్ లో స్పందన బాగున్నప్పటికీ తెలుగులో మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోతున్నారు మణిరత్నం. అందువల్లే హైదరాబాద్ లాంటి కీలక కేంద్రాల్లో మినహా మిగిలిన చోట్ల వసూళ్లు కాస్త నెమ్మదిగానే ఉన్నాయి. ఇక ఇందులో శింబు పాత్ర మెగా ఫ్యాన్స్ మధ్య చర్చకు దారి తీసింది. ఎందుకంటారా.
కథ రాసుకున్నాక మణిరత్నం మనసులో రుద్రా పాత్ర కోసం అనుకున్నది రామ్ చరణ్ నే. దాని కోసం ప్రత్యేకంగా సుహాసినితో సహా హైదరాబాద్ వచ్చి చిరు ఇంట్లో చర్చలు కూడా జరిపాడు. కానీ చెలియా ఫలితంతో పాటు అంతకు ముందు సినిమాల పెర్ఫార్మన్స్ దృష్టిలో ఉంచుకున్న చరణ్ ఓకే చెప్పే సాహసం చేయలేకపోయాడు. అది కాస్తా శింబుకు వెళ్ళింది. ఇది ఎప్పటి నుంచో నలుగుతున్న వార్తే.
ఇప్పుడు నవాబ్ విడుదలైపోయింది. ఫలితం కూడా తేలిపోయింది. మణిరత్నం మాస్టరీ మరోసారి బయటపడింది కానీ మునపటి మేజిక్ కనిపించలేదన్నది వాస్తవం. ఇక శింబు పాత్ర విషయానికి వస్తే అందులో నెగటివ్ వైబ్రేషన్స్ చాలా ఉన్నాయి. దుర్మార్గుడైన అన్నయ్య పతనం కోరుతూ అందుకోసం ఎంతకైనా తెగించే పాత్రలో శింబు జీవించాడు. కానీ రామ్ చరణ్ కు ఇక్కడ ఉన్న ఇమేజ్ దృష్ట్యా అది ఏ మాత్రం నప్పుదు. పైగా ప్రయోగం కోసం చేసినా అభిమానులు మాస్ ప్రేక్షకులు ఇలాంటి వాటిని అంగీకరించరు. అన్ని ప్రత్యేకతలు ఉన్న ధృవనే కమర్షియల్ హిట్ చేసారు కానీ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ కాలేకపోయింది. అలాంటాప్పుడు శింబు ప్లేస్ లో రామ్ చరణ్ ని ఊహించుకుంటే ఖచ్చితంగా మైనస్ అయ్యేది. పైగా దానికి ఇచ్చిన ముగింపు ప్రీ క్లైమాక్స్ లో ట్విస్ట్ అన్ని కూడా స్టార్ హీరోల విషయంలో ప్రేక్షకులు జీర్ణించుకునేవి కాదు.
శింబుకు ఇలాంటివి అలవాటే కాబట్టి అందరు కనెక్ట్ అయ్యారు కానీ చరణ్ కు రాంగ్ ఛాయస్ గా మిగిలేది. ఇంత స్టార్ కాస్ట్ ఉన్నా డివైడ్ టాక్ తో స్లో గా ఉన్న నవాబ్ ని చరణ్ వదులుకుని మంచి పని చేసాడనే చెప్పాలి. ప్రస్తుతం బోయపాటి సినిమాతో పాటు సైరా నిర్మాణం చూసుకుంటూ బిజీగా ఉన్న చరణ్ ఈ రెండు బాధ్యతలు పూర్తి కాగానే పూర్తి స్థాయిలో తారక్ తో కలిసి రాజమౌళి మల్టీ స్టారర్ కోసం అంకితమైపోతాడు. అందుకోసమే ఎదురు చూస్తున్నారు మెగా ఫాన్స్