Begin typing your search above and press return to search.

కుర్రాడు.. మగధీర మీద కన్నేశాడు

By:  Tupaki Desk   |   11 Oct 2015 10:30 PM GMT
కుర్రాడు.. మగధీర మీద కన్నేశాడు
X
ఇంకో ఐదు రోజులే మిగిలుంది మెగా కుర్రాడు రామ్ చరణ్ సందడికి. ముహూర్తం రోజు చెప్పినట్లే అక్టోబరు 16న ‘బ్రూస్ లీ’ సినిమా విడుదలపైపోతోంది. ఈ సినిమా మీద ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంతకుముందు చరణ్ సినిమాల్లో ఇంత క్రేజ్ వచ్చింది.. ‘మగధీర’కే. అందుకే చరణ్ కలెక్షన్ల టార్గెట్ కూడా ‘మగధీర’ రికార్డుల మీదే ఉంది. హీరోగా రెండో సినిమాకే ఇండస్ట్రీ రికార్డు హిట్ ఇచ్చిన చరణ్.. మళ్లీ ఆ రికార్డుల దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయాడు. దీంతో ‘మగధీర’ క్రెడిట్ చరణ్ కు ఇవ్వడానికి ట్రేడ్ పండిట్స్ సందేహించారు. ఆ క్రెడిట్లో ఎక్కువ వాటా రాజమౌళికే వెళ్లింది.

ఐతే ‘బ్రూస్ లీ’ ‘మగధీర’ రికార్డుల్ని బద్దలు కొట్టి సినిమాతో హీరోగా తన స్టామినా చూపించాలని చూస్తున్నాడు చరణ్. చిరు ఓ మోస్తరు హిట్ ఇచ్చినా.. రూ.40 కోట్లు ఈజీగా వచ్చేస్తున్నాయి. మొన్నా మధ్య ‘గోవిందుడు అందరివాడేలే’ కూడా అలాగే రూ.40 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఐతే ‘బ్రూస్ లీ’ సూపర్ హిట్ అయితే.. దానికి రెట్టింపు వసూళ్లు సాధించడం పెద్ద విషయమేం కాదు. అందుకు తగ్గ క్రేజ్ ఉంది. గ్రౌండ్ కూడా ప్రిపేరైంది. ‘బ్రూస్ లీ’ మీద ముందే ఫుల్ పాజిటివ్ బజ్ ఉంది. శ్రీను వైట్ల అనగానే రీచ్ ఎక్కువ ఉంటుంది. చరణ్ కు మాస్ లో మంచి ఫాలోయింగే ఉంది కానీ.. ఫ్యామిలీ ఆడియన్స్ తో ఇంకా కనెక్టవలేదు. ఈ గ్యాప్ ను వైట్ల ఫిల్ చేసేస్తున్నాడు. ట్రైలర్ అంచనాల్ని బాగా పెంచింది. ఇక మెగాస్టార్ ఫ్యాక్టర్ కూడా ఎలాగూ ఉంది. అన్నిటికీ మించి.. చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ రిలీజ్ కాబోతోంది ‘బ్రూస్ లీ’. బాహుబలి, శ్రీమంతుడు లాంటి సినిమాల తర్వాత తెలుగు సినిమా మార్కెట్ కూడా బాగా విస్తరించింది కూడా. ఈ నేపథ్యంలో ‘బ్రూస్ లీ’కి పాజిటివ్ టాక్ వస్తే ‘మగధీర’ రికార్డుల్ని బద్దలు కొట్టడం పెద్ద విషయమేమీ కాదు.