Begin typing your search above and press return to search.

జపాన్ ప్రేక్షకులకు కాలభైరవుడి థ్యాంక్స్

By:  Tupaki Desk   |   11 Sept 2018 3:36 PM IST
జపాన్ ప్రేక్షకులకు కాలభైరవుడి థ్యాంక్స్
X
తెలుగుసినిమా పరిథి ఊహించలేనంతగా విస్తరిస్తోంది. 'బాహుబలి' దెబ్బతో దేశవ్యాప్తంగానే కాకుండా ఇండియన్స్ పెద్దగా లేని వివిధ ఇతర దేశాలలో కూడా తెలుగు సినిమాకు మార్కెట్ పెరుగుతోంది. 'బాహుబలి' జపాన్ లో ఘన విజయం సాధించడంతో దర్శకుడు SS రాజమౌళి పాత చిత్రాలకు అక్కడ డిమాండ్ పెరిగింది. దానిని దృష్టిలో పెట్టుకొని ఆగష్టు 31 న 'మగధీర' జపనీస్ వెర్షన్ ను రిలీజ్ చేయగా అక్కడ ఘనవిజయం సాధించింది.

ఇప్పటివరకూ జపాన్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన ఇండియన్ ఫిలిం 'ముత్తు'. రజనీకాంత్ కు జపాన్ లో భారీ ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన ఆ చిత్రం 20 ఏళ్ళ క్రితం 1.6 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అప్పటినుండి ఆ రికార్డును వేరే ఇండియన్ సినిమా టచ్ చేయలేక పోయింది. బాహుబలి కూడా 1. 2 మిలియన్ డాలర్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇప్పుడు తాజాగా 'మగధీర' 1.77 మిలియన్ డాలర్లతో 'ముత్తు' ఇరవై ఏళ్ళ రికార్డ్ ను బ్రేక్ చేసింది.

ఇక జపాన్ ప్రేక్షకులు సినిమా పై చూపిస్తున్న అభిమానానికి మెగా పవర్ స్టార్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు. "థ్యాంక్ యు జపాన్.. మీరు మామీదచూపిస్తున్న అభిమానానికి - ప్రేమకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఎప్పటికీ నా మనసులో ఉంటుంది. ఇలాంటి మరపురాని చిత్రాన్ని అందించినందుకు SS రాజమౌళి గారికి బిగ్ థ్యాంక్ యు. ఈ సినిమా రిలీజై పదేళ్ళు అయిందంటే నమ్మలేకపోతున్నా" అని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు.