Begin typing your search above and press return to search.
న్యూస్ ఛానల్ కొనుగోలు చేసే ఆలోచనలో రామ్ చరణ్..?
By: Tupaki Desk | 11 Sep 2021 6:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ అన్ని విషయాల్లోనూ తన తండ్రి బాటలో నడుస్తున్నారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బిజినెస్ మీద ఫోకస్ పెడుతూ వస్తున్నారు. ఇప్పటికే పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన చరణ్.. ఇప్పుడు మీడియా రంగంలో అడుగుపెట్టబోతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. రామ్ చరణ్ త్వరలో ఓ తెలుగు టీవీ న్యూస్ ఛానెల్ ని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అంతగా పాపులర్ అవ్వని ఆ ఛానల్ తో చెర్రీ చర్చలు చివరి దశలో.. త్వరలోనే చేతులు మారే అవకాశం ఉందని అనుకుంటున్నారు.
ఓ ప్రముఖ తెలుగు జర్నలిస్ట్ స్థాపించిన ఈ ఛానల్ ఇప్పటికే అనేక మంది చేతులు మారింది. కారణలేవైతేనేం ఈ న్యూస్ ఛానల్ కు ఆశించిన స్థాయిలో ప్రజాదరణ దక్కలేదు. అయితే ఇప్పుడు ఆ ఛానల్ ను తీసుకోడానికి చేసుకోవడానికి రామ్ చరణ్ ఆకర్షణీయమైన ఆఫర్ తో ముందుకు వచ్చారట. గతంలో చిరంజీవి 'మా టీవీ' లో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చెర్రీ కూడా మీడియా రంగంలోకి రావాలని చూస్తున్నారట.
న్యూస్ ఛానెల్ తో పాటుగా ఓ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ ను కూడా కొనుగోలు చేయాలని చరణ్ ఆలోచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఒకవేళ ఇదే కనుక నిజమైతే వచ్చే ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ప్రచారానికి చరణ్ ఛానల్ ఉపయోగపడే అవకాశం ఉంది.
ప్రస్తుత రాజకీయాల్లో మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుందనే సంగతి తెలిసిందే. చాలా వరకు పొలిటికల్ పార్టీలకు సొంతగా ఛానల్స్ ఉన్నాయి. పలు ఛానల్స్ బాహాటంగానే కొన్ని రాజకీయ పార్టీలకు మద్దతుగా వార్తలు ఇస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ఇప్పుడు రామ్ చరణ్ న్యూస్ ఛానల్ కొనుగోలు చేసి తన బాబాయి పార్టీ ప్రచారం కోసం తనవంతు సహాయం చేస్తాడేమో చూడాలి.
ఇక సినిమాల విషయానికొస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్.ఆర్.ఆర్' సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే తన తండ్రి చిరంజీవితో కలసి 'ఆచార్య' చిత్రంలో నటిస్తున్నాడు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇటీవల శంకర్ దర్శకత్వంలో చెర్రీ ఓ పాన్ ఇండియా మూవీని ప్రారంభించారు.