Begin typing your search above and press return to search.
సెంటిమెంట్ వర్కవుటవుతుందా చెర్రీ?
By: Tupaki Desk | 11 Jun 2015 11:30 AM GMTఅప్పటికే పరిచయం ఉన్న పదాలతో టైటిల్స్ పెడితే సినిమా జనాల్లోకి దూసుకెళ్లడం సులువు. అలాగే ఏదైనా సూపర్‌హిట్ గీతాన్ని తిరిగి రీమిక్సుల రూపంలో వదిలితే పబ్లిసిటీ కూడా అంతే కలిసి వస్తుంది. ఆ చిత్రానికి క్రేజు రెట్టింపవుతుంది. ఈ ఫార్ములాని టాలీవుడ్‌లో ఉన్న ప్రతి హీరో అనుసరిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా రామ్‌చరణ్ చేస్తున్నది కూడా ఇదే. తండ్రి ఛరిష్మాని తన సినిమాలకు ఉపయోగించుకోవడంలో చెర్రీ ఘనాపాటి. బంగారు కోడిపెట్ట, వాన వాన వెల్లువాయె.. వంటి రీమిక్సులతో మాస్ అభిమానుల్లో ఫీవర్ రాజేసి పెద్ద హిట్టు కొట్టాడు. అదే తీరుగా మెగా సాంగ్స్‌లోని పల్లవుల్ని కూడా తన సినిమాల టైటిల్స్‌గా మార్చేసుకుంటున్నాడు. ప్రస్తుతం శ్రీనువైట్ల డైరెక్షన్‌లో చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'మై నేమ్ ఈజ్ రాజు, సుప్రీమ్ అనే రెండు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇవి రెండూ చిరు మానియాకి సంబంధించినవే.
మైనేమ్ ఈజ్ రాజు చిరు నటించిన జగదీక వీరుడు అతిలోక సుందరిలో బాగా పాపులర్ అయిన పాట పల్లవి. ఈ టైటిల్ మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఇక సుప్రీమ్ అనేది చిరంజీవి బిరుదు. ఛాలెంజ్ సినిమాలో చిరు నటనకు ప్రశంసగా ఈ బిరుదు ఇచ్చి గౌరవించారు. ఇప్పుడు చరణ్ సినిమాకి 'సుప్రీమ్' టైటిల్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
తండ్రికి సంబంధించిన ఏ అభరణాన్ని అయినా తాను ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు చరణ్. ఈ సెంటిమెంటు శ్రీనూతో సినిమాకి కూడా వర్కవుటవుతోంది. చిత్రీకరణ పూర్తి కావచ్చింది. త్వరలోనే టైటిల్‌ని అధికారికంగా ప్రకటించనున్నారు. చూద్దాం ఈ సెంటిమెంట్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో.