Begin typing your search above and press return to search.
ఆ రీమేక్ తో నష్టాలు పూడుస్తాడట
By: Tupaki Desk | 20 Oct 2015 3:04 PM GMTరామ్ చరణ్-శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చిన బ్రూస్ లీ పై బయ్యర్లు బాగానే ఆశలు పెట్టుకున్నారు. క్రేజీ కాంబినేషన్ అనే ఉద్దేశ్యంతో పెద్ద మొత్తంలో ఇచ్చి హక్కులు కొనుగోలు చేశారు. కానీ బ్రూస్ లీ తో హీరో - డైరెక్టర్ తో పాటు.. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు కూడా బాగానే షాక్ కొట్టేట్లుంది.
తొలి రోజే డివైడ్ టాక్ వచ్చినా.. సాధారణంగా చెర్రీ సినిమాలు సేఫ్ జోన్ లోకి ఎంటర్ అయిపోతుంటాయి. కొన్నవాళ్లకు నష్టాలు మిగిల్చిన దాఖలాలు చాలా చాలా తక్కువ. అందుకే.. మెగాపవర్ స్టార్ సినిమాలను ఎంత పెట్టి అయినా కొనుగోలు చేసేందుకు ముందుకొస్తుంటారు. కానీ ఈ లెక్క బ్రూస్ లీ తప్పింది. డివైడ్ టాక్ వచ్చినా దసరా హాలిడేస్ కారణంగా పుంజుకుంటుందనే అంచనాలు కూడా విఫలమయ్యాయి. అక్టోబర్ 22న మరో మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కంచె సహా.. చాలా సినిమాలు క్యూ కట్టేశాయి. ఈ లోగా పెట్టుబడి రికవర్ కావడం కష్టమని తేలిపోయింది. బయ్యర్లు పెద్ద మొత్తంలో నష్టపోనుండడంతో ఈ నష్టాలను భరించేందుకు రామ్ చరణ్ డిసైడ్ అయినట్లు సమాచారం.
తన తరువాతి సినిమా తను ఒరువన్ రీమేక్ రైట్స్ ఇచ్చి.. ఈ నష్టాలను భర్తీ చేయనున్నాడట చెర్రీ. వీలైనంత త్వరగా అంటే 3 నెలల కాలంలోనే ఈ మూవీని తక్కువ బడ్జెట్ తోనే కంప్లీట్ చేసి.. బ్రూస్ లీ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకే ఇచ్చేలా ప్లాన్ చేయబోతున్నారట. ఈ ఏడాది డిసెంబర్ లో షూటింగ్ స్టార్ట్ చేసి.. 2016సమ్మర్ నాటికి రిలీజ్ చేయాలన్నది మెగాపవర్ స్టార్ ప్లాన్.
లాభాలొస్తే పండగ చేసుకున్నారుగా.. నష్టాలొచ్చినపుడు ఏడుస్తారెందుకు అని.. ఇన్ డైరెక్టుగా సెటైర్లు వేసే కాలం ఇది. కానీ స్వచ్ఛందంగా ముందుకొచ్చి లాస్ లను రివకర్ చేస్తాననడంతో.. హీరోగానే కాదు.. మనిషిగానూ చెర్రీ చాలా మెట్లు ఎక్కేశాడు.