Begin typing your search above and press return to search.
స్నేహం కోసం యూత్ హీరోలు
By: Tupaki Desk | 11 Aug 2019 6:34 AM GMTఒకప్పుడు ఇండస్ట్రీలో పోటీ తత్వం వల్ల నా సినిమా నాది నీ సినిమా నీది అనే తరహలో సాగిన స్టార్ హీరోల పోకడ ఇప్పుడు కొత్త దారులు వెతుకుతోంది. ముఖ్యంగా యూత్ ఐకాన్లుగా అభిమానులు భావించే హీరోలు స్నేహం విషయంలో అందరికి ఆదర్శంగా నిలుస్తూ అభిమానులకు సైతం స్ఫూర్తి ఇస్తున్నారు. మొన్న ఫ్రెండ్ షిప్ డే రోజున జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు ఎంత చక్కగా తమ స్నేహం గురించి చెప్పుకున్నారో చూసాం కదా. అభిమానులు ఆ ఫోటోలను ఎంత మురిసిపోయారో వర్ణించడం కష్టం.
ఇటీవలి కాలంలో చిన్న బడ్జెట్ సినిమాల ఈవెంట్లకు మీడియం రేంజ్ హీరోలు గెస్టులుగా వచ్చి వాటికి హైప్ తేవడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇక స్టార్ల విషయంలోనూ ఇది ఇచ్చిపుచ్చుకునే తరహాలో మంచి సాంప్రదాయం వైపు అడుగులు వేస్తోంది. శర్వానంద్ రణరంగం ఈ నెల 15న విడుదల అవుతోంది. చాలా కాలం తర్వాత ఇంటెన్సిటీ ఉన్న మాఫియా డాన్ పాత్ర పోషిస్తున్న శర్వా దీని మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇప్పటికే ట్రైలర్ కు భారీ స్పందన దక్కింది.
ఇప్పుడు తాజాగా సౌండ్ కట్ ట్రైలర్ ని తీసుకురాబోతున్నారు. ఇది లాంచ్ చేయడానికి రామ్ చరణ్ ఒప్పుకున్నట్టుగా టాక్. శర్వాకు చరణ్ కు మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఇది చాలా సందర్భాల్లో ఇద్దరూ స్వయంగా చెప్పుకున్నారు కూడా. ఇలాంటి చక్కని వాతావరణాన్ని సృష్టిస్తున్న మన హీరోలు తమ ఫ్యాన్స్ కు ఒకరకంగా మెసేజ్ ఇస్తున్నట్టే. మేమంతా ఒకటే అని చెబుతూ మీరు ఇలాగే కలిసి మెలిసి సినిమాల కోసం రికార్డుల కోసం గొడవలు పడకండి అని చెబుతున్నట్టే. అభిమానులూ వింటున్నారా