Begin typing your search above and press return to search.
'డ్రైవింగ్ లైసెన్స్' పట్టాలెక్కించబోతున్న చరణ్..?
By: Tupaki Desk | 12 March 2021 12:30 PM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మలయాళంలో సూపర్ హిట్ అయిన ''డ్రైవింగ్ లైసెన్స్'' సినిమా రీమేక్ రైట్స్ తీసుకున్నారని ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్ - చరణ్ కలిసి ఈ సినిమా చేస్తారనే టాక్ కూడా వచ్చింది. అయితే వీరిద్దరూ ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉండటంతో బాబాయ్ - అబ్బాయ్ కాంబోలో ఈ సినిమా కష్టమని డిసైడ్ అయ్యారు. అయితే ఇప్పుడు రాంచరణ్ బయటి హీరోతో ఈ మల్టీస్టారర్ ని పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.
మలయాళ 'డ్రైవింగ్ లైసెన్స్' సినిమా విషయానికొస్తే.. కొన్ని పరిస్థితుల వల్ల విరోధులుగా మారిన హీరో మరియు తనను అభిమానించే ఓ ఆర్టీఏ ఆఫీసర్ మధ్య జరిగిన సంఘటన సమూహారమే ఈ కథ. సింపుల్ కాన్సెప్ట్ తో తెరకెక్కినప్పటికీ కమర్షియల్ గా మంచి విజయాన్ని నమోదు చేసింది. పృథ్వీరాజ్ మరియు సూరజ్ ప్రధాన పాత్రలతో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అయితే ఇప్పుడు హీరో క్యారెక్టర్ కి మాస్ మహారాజా రవితేజని తీసుకొని.. ఆర్టీఏ అధికారి రోల్ కి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని తీసుకోవాలని చరణ్ ప్లాన్ చేస్తున్నాడట. ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో ఈ రీమేక్ సినిమాను విడుదల చేసేలా రామ్ చరణ్ ఆలోచిస్తున్నట్లుగా సినీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.