Begin typing your search above and press return to search.
చెర్రీతో వర్కవుట్ అయ్యే ఛాన్సుందిలే
By: Tupaki Desk | 17 Sep 2015 7:54 AM GMT2001లో రిలీజైంది హనుమాన్ జంక్షన్. అర్జున్ - జగపతిబాబు హీరోలుగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఆ సినిమాకి దర్శకుడు మోహన్ రాజా. అప్పటికి అతని వయసు 26. ఆ తర్వాత అతడు కోలీవుడ్ వెళ్లిపోయాడు. తన మూలాలు అక్కడే ఉన్నాయి. ఎడిటర్ మోహన్ టాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు పనిచేసిన ఫేమస్ ఎడిటర్. ఆయన తనయుడిగా రాజా మోహన్ కోలీవుడ్ లోనూ ఫేమస్ అయ్యాడు. మధ్యలో ఎందుకో గ్యాపొచ్చింది. మనోడు అవుటాఫ్ లైమ్ లైట్.
అయితే ఇప్పుడు మోహన్ రాజా తెరకెక్కించిన తమిళ చిత్రం తని ఒరువన్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక .. అతడి గురించి ఇంటా బైటా చర్చ సాగుతోంది. తని ఒరువన్ చిత్రాన్ని తెలుగులో రామ్ చరణ్ రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాలి. చరణ్ కంటే ముందే చిరుతో ఎడిటర్ మోహన్ కి అనుబంధం ఉంది. ఆ అనుబంధం ఇప్పుడు కలిసొచ్చేట్టే కనిపిస్తోంది. తెలుగులో చిరు నటించిన హిట్ సినిమాల్ని తమిళ ప్రేక్షకులకు డబ్బింగ్ చేసి అందించిన చరిత్ర ఎడిటర్ మోహన్ కి ఉంది. కాబట్టి ఇప్పుడు చెర్రీతో వర్కవుటవుతుందేమో చూడాలి.
1979-88 మధ్యలో ఎడిటర్ మోహన్ వంద పైగా సినిమాలకు పనిచేశారు. అంత బిజీ ఎడిటర్. అప్పట్లోనే చిరంజీవి నటించిన దొంగమొగుడు సినిమాని తమిళ ప్రేక్షకులకు చూపించిన ఘనత ఆయన సొంతం. అందుకేనేమో .. ఎక్కడ మూలాలు ఉంటే అక్కడికి వెతుక్కుంటూ రావాల్సి ఉంటుందంటారు. ఎడిటర్ మోహన్ తనయుడు జయం రవి హీరోగా అతడి అన్న మోహన్ రాజా దర్శకత్వం వహించిన తని ఒరువన్ చరణ్‌కి నచ్చడానికి ఇవన్నీ కూడా కారణాలేనంటారా?