Begin typing your search above and press return to search.
రాజమండ్రికి చరణ్ విమానాలు!!
By: Tupaki Desk | 15 July 2015 8:10 AM GMTనిన్నంతా రాజమండ్రి విమానాశ్రయంలో ఒకటే భీకరశబ్ధాలు. ఎగిరే విమానం, కిందికి దిగే విమానం.. వరుసగా మూడు విమానాలు విమానాశ్రయంలో దిగాయి. వీటిలోంచి ముఖ్యులంతా బిళబిళమంటూ దిగారు. అందులో జాతీయ కాంగ్రెస్ నేత మెగాస్టార్ చిరంజీవి, కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద, కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి వంటి ప్రముఖులు దిగారు. అయితే వీరి రాకకు బోలెడంత అర్థం పరమార్థ్థం ఉంది.
గోదావరి పుష్కరాలను పురష్కరించుకుని అక్కడ భక్తకోటిని, ప్రజానీకాన్ని విహంగవీక్షణం చేయడానికి, సేమ్ టైమ్ నిన్నటి రోజున జరిగిన తొక్కిసలాటల్లో మరణించి(27మంది)న వారి గురించి ఆరాతీయడానికి, వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి.. ఇన్నిరకాల పనుల్ని పెట్టుకుని విచ్చేశారు. అరతేనా అయితే ఇక్కడో కొత్త పాయింట్ ఒకటి చర్చకొచ్చింది. అసలు ఈ ప్రముఖులంతా విచ్చేసిన విమానాలు ఎవరివి? అన్నదే ఆ చర్చ.
అప్పట్లో రామ్‌చరణ్ ట్రూజెట్ సర్వీసుల్ని ప్రారంభించాడు కదా! తక్కువ దూరాలకు జనాల్ని చేరవేసే ఛార్టర్డ్ విమానాలివి. ఇప్పుడు వాటినే పుష్కరాలకు ఉపయోగించారన్నమాట. అయితే రాజమండ్రి చేరుకోవడానికి స్పైస్ జెట్ మరియు జెట్ ఎయిర్వేస్ వంటి లీడింగ్ ప్లేయర్స్ సర్వీస్ అందిస్తున్నా కూడా అవి అన్ని సమయాల్లో అందుబాటులో లేకపోవడం తో చరణ్ కు ప్లస్ అయ్యింది. అదీ సంగతి.