Begin typing your search above and press return to search.

మలేషియాలో మంచు - కొణిదెల ఫ్రెండ్స్!

By:  Tupaki Desk   |   27 July 2016 9:33 AM GMT
మలేషియాలో మంచు - కొణిదెల ఫ్రెండ్స్!
X
తెలుగుసినిమా ఇండస్ట్రీలో చాలా మంది మంచి స్నేహితులు ఉన్నారు. వారిలో ఒక జంట స్నేహం మాత్రం బలే విచిత్రంగా ఉంటుంది. ఏ విషయమైనా బహిరంగంగా కుండబద్దలు కొట్టేసుకుంటారు.. అంతే ఆత్మీయంగా ఒకరినొకరు అభినందించుకుంటూ - పొగిడేసుకుంటారు. ఇప్పటికే తెలిసింది కదా ఆ స్నేహితులు చిరంజీవి - మోహన్ బాబు అని. వీరిద్దరి గురించి తెలిసినవారు వీరిది టాం అండ్ జెర్రీ బందమని జోక్స్ వేస్తుంటారు కూడా. వీరిసంగతి కాసేపు పక్కనపెడితే... వీరి పిల్లలు మాత్రం చిన్నప్పటినుండీ మాంచి స్నేహితులుగానే ఉంటున్నారు. వీకెండ్ పార్టీల్లోనూ, ఫ్యామిలీ ఫంక్షన్స్ లోనూ వీరిమధ్య సాన్నిహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది.

ఎప్పుడూ రామ్ చరణ్ - మంచు లక్ష్మీ కలిసి కనిపిస్తుంటారు కానీ... వీరిద్ధరూ వీరివీరి లైఫ్ పార్ట్నర్స్ తో కనిపించిన సందర్భాలు పెద్దగా కనిపించవు! అయితే తాజాగా రామ్ - ఉపాసన - మంచు లక్ష్మీ - ఆండీ శ్రీనివాస్ లు కలిసి వీకెండ్ మొత్తం ఫుల్ గా ఎంజాయ్ చేశారట. ఈ పార్టీ ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ... మంచులక్ష్మీ తాజాగా ఈ ఫోటోలను షేర్ చేసింది. థాయ్ లాండ్ లోని ఖోసముయ్ అనేప్రాంతంలో వీరంతా కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేసినట్లు సమాచారం. ఈ పార్టీలో ఉపాసన - రామ్ చరణ్ - మంచులక్ష్మీ - ఆమె భర్త ఆండీ శ్రీనివాస్ తో పాటు మరికొందరు కూడా జాయిన్ అయ్యారట. వీరి స్నేహాలను చూసి.. అభిమానులు కూడా ఇలా ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటున్నారు కొందరు ఆశావాదులు!