Begin typing your search above and press return to search.
'రంగస్థలం' ని కొట్టేశావా రామా!
By: Tupaki Desk | 16 Nov 2018 5:22 AM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ ఫేజ్ తో దూసుకుపోతున్నాడు. రంగస్థలం చిత్రంతో బాక్సాఫీస్ బరిలో మెగా పవర్ ఎంతో చూపించాడు. దాదాపు 100కోట్ల షేర్ వసూళ్లతో ఇండస్ట్రీ రికార్డుల్ని బ్రేక్ చేసింది ఈ చిత్రం. మాస్‌లో బాస్ స్టైల్ ఏ రేంజులో ఉంటుందో చరణ్ లోనూ అంతే గ్రేస్ ఉందని ఆ సినిమా నిరూపించింది. `ఖైదీనంబర్- 150` తర్వాత మెగా కాంపౌండ్ లో అతి పెద్ద విజయం కావడంతో కొణిదెల హౌస్ లో బోలెడంత ఉత్సాహం వెల్లి విరిసింది. ఇప్పుడు అంతకుమించి అని నిరూపించాల్సిన సన్నివేశం ఉంది.
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తనకు అంతే పెద్ద బ్లాక్ బస్టర్ ని ఇస్తాడని రామ్ చరణ్ బృందం నమ్మి అవకాశం ఇచ్చింది. `వినయ విధేయ రామా` అంటూ షాకిచ్చే టైటిల్ తో బోయపాటి పెద్ద ట్విస్టునే ఇచ్చాడు. మరీ ఆ రేంజు మాస్ టీజర్ తో - ఈ రేంజు క్లాస్ టైటిల్ ని పరిచయం చేశాడే అంటూ ముక్కున వేలేసుకున్నారంతా. టీజర్ లో చరణ్ విసిరిన సవాల్ లానే బిజినెస్ లోనూ సవాల్ విసురుతోంది ఈ మూవీ.
ఇప్పటికే హిందీ రైట్స్ ని భారీ మొత్తానికి అమ్మేశారన్న సమాచారం ఉంది. హిందీ డబ్బింగ్ - శాటిలైట్ కి గంపగుత్తగా 22కోట్లు పలికిందని వార్తలొచ్చాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రీరిలీజ్ బిజినెస్ లో సత్తా చాటుతోంది వినయ విధేయ రామా. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా డీల్ పూర్తయిందని తెలుస్తోంది. భారీ కాంపిటీషన్ నడుమ 5.6 కోట్లకు డీల్ కుదిరిందిట. ఎన్ ఆర్ ఏ బేసిస్ లో గీతా ఫిలింస్ సంస్థ హక్కులు కొనుక్కుంది. ఇక్కడ `రంగస్థలం` 4.2 కోట్లకు రైట్స్ కొనుక్కుంటే - 6.35కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే `రంగస్థలం` రిలీజ్ డే రోజున బ్లాక్ బస్టర్ అన్న పాజిటివ్ టాక్ తో ఆ స్థాయి వసూళ్లు సాధమయ్యాయి. ఇప్పుడు `వినయ విధేయ రామా` చిత్రానికి బెట్టింగ్ భారీగా నడుస్తోంది కాబట్టి, రంగస్థలంకి వచ్చినట్టే బ్లాక్ బస్టర్ టాక్ తొలిరోజు వస్తేనే భారీ వసూళ్లు సాధ్యమవుతాయి. మరి చెర్రీ అండ్ టీమ్ ఏం చేస్తారో చూడాలి. సంక్రాంతి బరిలో `వినయ విధేయ రామా` రిలీజ్ కి రెడీ అవుతోంది.