Begin typing your search above and press return to search.

సల్మాన్ కోసం చరణ్ రెండో సారి

By:  Tupaki Desk   |   18 April 2019 5:53 AM GMT
సల్మాన్ కోసం చరణ్ రెండో సారి
X
వయసులో చాలా వ్యత్యాసమున్నప్పటికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మన రామ్ చరణ్ ల మధ్య మంచి స్నేహం ఉంది. అది చిరంజీవి హయాం నుంచే ఉన్నప్పటికీ గత కొన్నేళ్ళలో ఈ బాండింగ్ మరింత బలపడింది. ఎంతగా అంటే సల్మాన్ షూటింగ్ ఏదైనా హైదరాబాద్ లో ఉందంటే అతనికి చెర్రి ఇంటి నుంచి స్పెషల్ గా బిర్యానీ క్యారేజీ రోజు వెళ్ళేంతగా. అందుకే చిరు తన అరవై ఏళ్ళ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నప్పుడు సల్మాన్ అదే పనిగా ముంబై నుంచి వచ్చి మరీ హంగామా చేశాడు.

చెర్రి జంజీర్ చేయడంలో సల్మాన్ ప్రభావమే ఎక్కువ. ఇప్పటికీ హింది సినిమాలు చేయమని పోరు పెడుతూనే ఉంటాడట. ఇదిలా ఉండగా సల్మాన్ కొత్త సినిమా భరత్ కోసం చరణ్ గాత్రం ఇవ్వబోతున్నట్టు ఫ్రెష్ అప్ డేట్. జూన్ 5న విడుదల కానున్న భరత్ ను తెలుగు తమిళ్ లో కూడా అనువదిస్తున్నారు. తెలుగు వెర్షన్ లో సల్మాన్ పాత్రకు చరణ్ డబ్బింగ్ చెప్పబోతున్నట్టుగా తెలిసింది. అయితే ఇది మొదటిసారి కాదు.

గతంలో ప్రేమ్ రతన్ ధన్ పాయోకు చరణ్ ఇలాగే తన స్వరం ఇచ్చాడు. అందులో రాజవంశస్తుడిగా నటించిన సల్మాన్ పాత్రకు చెర్రి గాత్రం బాగా సెట్ అయ్యింది. అందుకే ఇప్పుడు భరత్ కూడా వాయిస్ ఇవ్వమని సల్మాన్ స్వయంగా రిక్వెస్ట్ చేయడంతో చెర్రి ఒప్పుకున్నట్టుగా వినికిడి. దీని తాలుకు వర్క్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో మళ్ళి జాయిన్ అయ్యే లోపే పూర్తి చేసేస్తారు. విడుదలకు ఇంకా టైం ఉన్నప్పటికీ భరత్ ను భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు టీం ఇప్పటి నుంచే అగ్రెసివ్ ప్రమోషన్ కు తెర తీసింది. ఇప్పుడు చరణ్ వాయిస్ తోడవుతోంది కాబట్టి భరత్ కు అదనపు హైప్ రావడం ఖాయం