Begin typing your search above and press return to search.

స‌ల్మాన్‌కి మెగా హీరో డ‌బ్బింగ్

By:  Tupaki Desk   |   20 Oct 2015 4:49 AM GMT
స‌ల్మాన్‌కి మెగా హీరో డ‌బ్బింగ్
X
బాలీవుడ్ సినిమాలు టాలీవుడ్‌ లోనూ కాసుల్ని కొల్ల‌గొడుతున్నాయి. ఇటీవ‌లి కాలంలో ధూమ్ సిరీస్‌ - క్రిష్ సిరీస్ తెలుగు బాక్సాఫీస్ వ‌ద్ద భారీగానే లాభాలార్జించాయి. అంత‌కంటే ముందే నాటి మేటి క్లాసిక్స్ కూడా తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించిన సంద‌ర్భాలున్నాయి. దాదాపు పాతికేళ్ల కింద‌ట సల్మాన్‌ ఖాన్ హీరోగా రాజ‌శ్రీ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించిన మైనే ప్యార్ కియా చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించింది.

ఆ రోజుల్లోనే ఈ ఫ్యామిలీ ల‌వ్ ఎంట‌ర్‌ టైన‌ర్ ప్రేమ పావురాలు పేరుతో తెలుగులోకి అనువాద‌మై స‌రికొత్త రీఫ్రెష్‌ మెంట్ ఉన్న సినిమాగా ఆక‌ట్టుకుంది. హ‌మ్ ఆప్ కే హై కౌన్ చిత్రం కూడా తెలుగులో అనువాద‌మై మంచి హిట్ కొట్టింది. షారూక్ ఖాన్ దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే పెద్ద హిట్ కొట్టింది. బాలీవుడ్ సినిమాలెన్నో తెలుగు ప్రేక్ష‌కుల మెప్పు పొందాయి. అయితే గ‌త ట్రాక్ రికార్డును దృష్టిలో పెట్టుకుని స‌ల్మాన్‌ ఖాన్ త‌న తాజా చిత్రం ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో ని తెలుగులో అనువ‌దించి రిలీజ్ చేయాల‌నుకుంటున్నాడు. అందుకోసం ఇప్ప‌టికే త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పాల్సిందిగా రామ్‌ చ‌ర‌ణ్‌ ని కోరాడు. అత‌డు కోరిందే త‌డ‌వుగా చెర్రీ వెంట‌నే ఓకే చెప్పాడు.

ప్రేమ‌ర‌త‌న్‌.. ఓ చ‌క్క‌ని ఫ్యామిలీ ఎంట‌ర్‌ టైన‌ర్‌. ఇలాంటివి తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతాయ‌న్న న‌మ్మ‌కంతోనే స‌ల్మాన్ రిలీజ్ చేస్తున్నాడు. త‌న ఫేవ‌రెట్ ప్రొడ‌క్ష‌న్ రాజ‌శ్రీ ఫిలింస్ నిర్మించిన చిత్ర‌మిది. ఈ మంగ‌ళ‌వారం నుంచే హైద‌రాబాద్‌ లోని ఓ డబ్బింగ్ స్టూడియోలో చ‌ర‌ణ్ వాయిస్ అందించ‌బోతున్నాడు. అదీ మ్యాట‌రు.