Begin typing your search above and press return to search.
'భీమ్' కోసం నాలుగు భాషల్లో గర్జించిన 'రామరాజు'...!
By: Tupaki Desk | 22 Oct 2020 3:00 PM GMTదర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం 'ఆర్.ఆర్.ఆర్'(రౌంద్రం రణం రుధిరం). చరణ్ 'అల్లూరి సీతారామరాజు'గా నటిస్తుండగా.. తారక్ 'కొమురం భీమ్' పాత్రలో నటిస్తున్నాడు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు' విడుదలవ్వగా.. తాజాగా కొమురం భీమ్ 119వ జయంతి సందర్భంగా 'రామరాజు ఫర్ భీమ్' పేరుతో తారక్ ఇంట్రో వీడియో రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ స్టన్నింగ్ విజువల్స్ కి చరణ్ వాయిస్ తోడై ఈ టీజర్ విశేష స్పందన తెచ్చుకుంది.
రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో ''వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి.. నిలబడితే సామ్రాజ్యాలు సాగిల పడతాయి.. వాడి పొగరు ఎగిరే జెండా.. వాడి దైర్యం చీకట్లని చీల్చే మండుటెండ.. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ.. నా తమ్ముడు గోండు బెబ్బులి.. కొమరం భీమ్'' అంటూ ఎన్టీఆర్ పాత్రని పరిచయం చేశాడు. ఈ టీజర్ కి కె.కె. సెంథిల్ కుమార్ అందించిన అద్భుతమైన విజువల్స్ మరియు కీరవాణి అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరో స్థాయికి తీసుకెళ్లాయి. అలానే రామ్ చరణ్ వాయిస్ ఓవర్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఎన్టీఆర్ 'భీమ్ ఫర్ రామరాజు' కోసం తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ కూడా తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో 'రామరాజు' కోసం గర్జించాడు. నిజానికి ఈ టీజర్ కి ముందు చరణ్ తెలుగులో మాత్రమే డబ్బింగ్ చెప్పగలడని.. తమిళ కన్నడ హిందీ భాషల్లో కష్టమే అని కామెంట్స్ చేసారు. అయితే చరణ్ మాత్రం మూడు దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా మంచి ఈజ్ తో డబ్బింగ్ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు. కాకపోతే మలయాళ వర్షన్ కి మాత్రం వేరే ఆర్టిస్టుతో డబ్బింగ్ చెప్పించారు.
'రామరాజు ఫర్ భీమ్' ప్రస్తుతం నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో ఉంది. ఈ క్రమంలో యూట్యూబ్ లో భీమ్ టీజర్ రికార్డులు తిరగరాస్తోంది. విడుదలైన 7 నిమిషాల్లోనే 100K లైక్స్ సాధించిన టీజర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఏదేమైనా ఇద్దరు స్టార్ హీరోలకు సంబంధించిన ఇంట్రో వీడియోలు రిలీజ్ చేయడంలో రాజమౌళి అవలంభించిన విధానాన్ని పొగడకుండా వుండలేము. ఎందుకంటే రామరాజు టీజర్ లో చరణ్ విజువల్స్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ని కలిపి ఇద్దరు హీరోలకి న్యాయం చేసిన జక్కన్న.. ఇప్పుడు భీమ్ ఇంట్రో వీడియోలో ఎన్టీఆర్ విజువల్స్ కి చరణ్ వాయిస్ ని జత చేసి చూపించాడు.
పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కతున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అలియా భట్ - ఒలీవియా మోరిస్ - అజయ్ దేవగన్ - శ్రియా - సముద్రఖని - అలిసన్ డూడీ - రే స్టీవెన్ సన్ ఈ మూవీలో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భారీ అంచనాలకు తగ్గట్టు రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహకాలు చేస్తున్నారు.