Begin typing your search above and press return to search.

చెర్రీ వైఫ్.. ఆమెను ఫాలో అయిపోతోందా?

By:  Tupaki Desk   |   15 Nov 2016 3:30 PM GMT
చెర్రీ వైఫ్.. ఆమెను ఫాలో అయిపోతోందా?
X

టాలీవుడ్ లో హీరోలు చాలామందే ఉన్నా.. ఆయా హీరోల భార్యల పేర్లు మీడియాలో నానడం.. భర్త సినిమాలకు సంబంధించి భార్య యాక్టివ్ పార్ట్ తీసుకోవడం లాంటివి గతంలో కనిపించేవి కాదు. కానీ.. మహేష్ వైఫ్ నమ్రతా శిరోద్కర్ ఈ ట్రెండ్ ను మార్చేసింది. స్క్రీన్ వెనుక అన్నీ తానై వ్యవహరిస్తూ.. మహేష్ బ్రాండ్ బిల్డింగ్ లో కీలక పాత్ర పోషించేసింది. ఇప్పుడు రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా నమ్రతు ఫాలో అయిపోతున్నట్లుగా కనిపిస్తోంది.

తను బిజీగానే ఉన్నా ఇటు చరణ్ కు సంబంధించిన పనులను హ్యాండిల్ చేసేస్తోందిట. చెర్రీ రాబోయే మూవీ ధృవ రిలీజ్ కి రెడీ అవుతుండడంతో.. రిలీజ్ కి సంబంధించిన ప్లానింగ్.. ప్రమోషన్స్ కోసం ప్రణాళికల్లో కార్పొరేట్ ఇంటెలిజిన్స్ ను ఉపయోగిస్తోందట ఉపాసన. బ్రూస్ లీ రిలీజ్ టైమ్ కే చెర్రీ మూవీస్ పనులను టేకప్ చేసినా.. అప్పటికే రిలీజ్ డేట్ దగ్గర పడిపోవడంతో.. పెద్దగా చేయడానికి ఏం లేకపోయింది. కానీ ఇప్పుడు మాత్రం చేతినిండా సమయం ఉండడంతో.. వీలైనంతగా బజ్ క్రియేట్ చేసేందుకు అన్ని యాక్టివిటీస్ ను ఈమె చేపడుతోందని తెలుస్తోంది.

ముంబై నుంచి ప్రమోషన్ ఏజన్సీని తీసుకురావడం.. ఈమె చేసినవాటిలో అతి ముఖ్యమైనది. గతంలో మెగాస్టార్ బర్త్ డే బాష్ తో పాటు.. శ్రీజ వెడ్డింగ్ ను కూడా ఈ కంపెనీ చేతుల మీదుగానే నిర్వహించారు. చరణ్ హెల్త్ సంగతులను కూడా అనుక్షణం చూసుకుంటున్న వైఫ్.. అటు చెర్రీతో పాటు ఫారిన్ షూటింగ్ లకి కూడా వెళ్లిపోతోంది. సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి రావడంతో.. నమ్రతకు ఇండస్ట్రీ గురించి తెలుసు. కానీ కార్పొరేట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఉపాసన.. ఆమెను ఫాలో అయిపోతుండడం విశేషమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/