Begin typing your search above and press return to search.

మెగా కోడలి వర్కౌట్స్!!

By:  Tupaki Desk   |   9 Aug 2017 4:39 PM GMT
మెగా కోడలి వర్కౌట్స్!!
X
ఓ వైపు బిజినెస్ విమెన్ గా మరో వైపు మోగా ఫ్యామిలిలో కోడలిగా తన జీవితాన్ని హ్యాపీ గా గడుపుతున్నరు ఉపాసన. ఈ మెగా కోడల్ని మెగా అభిమానులు కూడా ఎంతో ఇష్టపడతారు. రామ్ చరణ్ భార్యాగా ఇంటి బాధ్యతలు అన్ని చూసుకుంటూనే అప్పుడప్పుడు కొన్ని వ్యాయామాలను కూడా చూసుకుంటోంది ఉపాసన.

సోషల్ మీడియాలో ఉపాసన ఎంత చురుగ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే సోషల్ మీడియాలో ఉపాసన ఏ విషయంపై స్పందించినా, ఫొటోస్ పోస్ట్ చేసినా నెటిజన్లు మద్దతుగా నిలుస్తూ..ఆమె ఫొటోస్ పై మంచి కామెంట్స్ పెడుతూ ఉంటారు. అయితే రీసెంట్ గా ఈ మోగా కోడలు పోస్ట్ చేసిన వీడియో నెటిజెన్లను తెగ ఆకట్టుకుంటోంది.

పెళ్ళైన కొత్తలో కాస్త బొద్దుగా కనిపించిన ఉపాసన గారు ఆ తర్వాత యోగాలు, వ్యాయామాలు వంటి వ్యాయామాలు చేసి ఎవ్వరు ఊహించని విధంగా మునుపటి కంటే స్లిమ్ గా తయారయ్యింది. అయితే ఇప్పుడు కాస్త కొత్తగా న్యూయార్క్ లో జిమ్ వర్కౌట్స్ చేస్తూ ఓ వీడియోను పేస్ బుక్ లో పోస్ట్ చేసింది ఉపాసన. అంతే కాకుండా ఇలా స్ట్రాంగ్ గా ఉండడంకోసం వ్యాయామాలు చేస్తున్నానంటే అందుకు కారణం ఈషానీ రెడ్డి అని చెప్పింది. అలాగే తనలో స్ఫూర్తిని కూడా నింపిందని అభిమానులతో పంచుకున్నారు ఉపాసన.