Begin typing your search above and press return to search.
చొక్కా విప్పడానికి రామ్ చరణ్ రెడీ
By: Tupaki Desk | 6 Jun 2018 4:29 AM GMTబాలీవుడ్ లో టాప్ హీరోలు సల్మాన్ ఖాన్.. హృతిక్ రోషన్.. అక్షయ్ కుమార్ లాంటి వాళ్లంతా చొక్కా విప్పి కండల ప్రదర్శన చేసిన వారే. సల్మాన్ అయితే దాదాపుగా ప్రతి సినిమాలోనూ ఒక్క సీన్ లో అయినా షర్ట్ వేసుకోకుండా కనిపించి అమ్మాయిలతో విజిల్స్ వేయిస్తుంటాడు. ఈ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్ కూ పాకింది.
అయితే సినిమాలో షర్ట్ విప్పి కనిపించేయడం అంటే అంత ఆషామాషీ వ్యవహారమేం కాదు. దాని వెనుక చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే బాడీ కరెక్ట్ షేప్ లో ఉంటేనే ఆ సీన్ పండుతుంది. అందుకే ఎన్టీఆర్ తన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ కోసం మూడు నెలలు జిమ్ లో తెగ కష్టపడ్డాడు. తాజాగా రిలీజ్ చేసిన అరవింద సమేత పోస్టర్ లో షర్ట్ లేకుండా ఎన్టీఆర్ ఫైట్ కు సిద్ధమైన స్టిల్ అదిరిపోయింది. ఇఫ్పుడు రామ్ చరణ్ కూడా తన నెక్ట్స్ మూవీలో షర్ట్ లేకుండా కనిపించేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పర్సనల్ ట్రైనర్ రాకేష్ వుడియార్ దగ్గర ట్రయినింగ్ తీసుకోవడం మొదలెట్టాడు.
మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రామ్ చరణ్ ప్రస్తుతం మూవీ చేస్తున్నాడు. ఇందులో వచ్చిన ఓ భారీ ఫైట్ ఎపిసోడ్ లో చరణ్ చొక్కా విప్పి తన కండలతో విలన్లను ఎదుర్కోతున్నాడు. అసలే బోయపాటి సినిమాల్లో యాక్షన్ సీన్లు ఓ రేంజిలో ఉంటాయి. ఇప్పుడు రామ్ చరణ్ షర్ట్ లేకుండా ఫైట్ కు దిగడం అంటే సామాన్యంగా ఉండదు మరి. ఈ విషయంలో అభిమానులను మెప్పించడానికి రామ్ చరణ్ జిమ్ లో చాలానే కష్టపడుతున్నాడు.