Begin typing your search above and press return to search.

రాత్రంతా చెర్రీతో పాటు షూటింగ్‌ లోనే!

By:  Tupaki Desk   |   12 July 2016 5:47 AM GMT
రాత్రంతా చెర్రీతో పాటు షూటింగ్‌ లోనే!
X
త‌న శ్రీమతి ఉపాస‌న రామ్‌ చ‌ర‌ణ్‌ కి ఎంతో ప్రేమ‌గా ఇచ్చిన బ‌హుమ‌తి.. బ్రాట్‌. విదేశీ జాతికి చెందిన ఆ కుక్క‌పిల్ల చాలా హుషారైన‌ది. రామ్‌ చ‌ర‌ణ్‌ కి అదంటే ప్రాణం. త‌న కొడుకులా చూసుకొంటుంటాడు. దానికి ఏమైనా అయితే చాలా బాధ‌ప‌డిపోతాడు. ఆ మ‌ధ్య మార్నింగ్ వాక్‌ లో ఆ కుక్క‌పిల్ల యాక్సిడెంట్‌ కి గురైంది. కాలు విరిగిపోయింది. దీంతో చ‌ర‌ణ్ త‌ల్ల‌డిల్లిపోయాడు. అది కోలుకొనేవ‌ర‌కు నాన్ వెజ్ ముట్ట‌లేదు. ఖ‌రీదైన ట్రీట్ మెంట్ ఇప్పించి మ‌ళ్లీ కోలుకొనేలా చేశాడు. ఆ కొన్నాళ్లు ద‌గ్గ‌రుండి మ‌రీ ఆ కుక్క‌పిల్ల‌కి స‌ప‌రిచ‌ర్య‌లు చేశాడ‌ట‌. ఇప్పుడు దాంతో చ‌ర‌ణ్ అనుబంధం మ‌రింత‌గా పెరిగిపోయింది. ఆయ‌న ఎక్క‌డికెళితే అక్క‌డే వ‌చ్చేస్తుంద‌ట‌.

ధ్రువ షూటింగ్‌ లో భాగంగా చ‌ర‌ణ్ రాత్రి వెళుతుంటే బ్రాట్ కూడా ఆయ‌న‌తో పాటే కార్‌ లో ఎక్కి వెళ్లిపోయింద‌ట‌. రాత్రి నుంచి ఉద‌యం ఆరు వ‌ర‌కు చ‌ర‌ణ్‌ తో పాటే షూటింగ్ చేస్తూ, అస‌లు నిద్ర కూడా పోకుండా గ‌డిపింద‌ట‌. ఆ విష‌యాన్ని చ‌ర‌ణ్ ఫేస్‌ బుక్ ద్వారా వెల్ల‌డించారు. బ్రాట్‌ తో షూటింగ్ అద్భుత‌మైన ఫీలింగ్‌ నిచ్చింద‌ని చెప్పుకొచ్చాడు. చ‌ర‌ణ్‌ కి ఉపాస‌న ఇచ్చిన బ్రాట్‌ తో పాటు ఇంట్లో ఇంకా చాలా కుక్క‌పిల్ల‌లే ఉన్నాయ‌ట‌. స‌మ‌యం దొరికితే చెర్రీ వాటితోనే కాల‌క్షేపం చేస్తుంటాడ‌ట‌.