Begin typing your search above and press return to search.
స్వామి శరణం.. చిన్ననాటి ఫ్రెండ్స్
By: Tupaki Desk | 24 Oct 2018 6:15 AM GMTఇండస్ట్రీలో రామ్ చరణ్ స్నేహాల గురించి ఆసక్తికర చర్చ సాగుతూనే ఉంది. ఎన్టీఆర్ - ప్రభాస్ - మహేష్ చరణ్ కి మంచి స్నేహితులు. అయితే వీళ్లకంటే చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్ శర్వానంద్. శర్వా సుదీర్ఘమైన కెరీర్ జర్నీకి చరణ్ సపోర్టు ఉందని చెబుతారు. ఇకపోతే చరణ్ - శర్వానంద్ ఇద్దరికీ యు.వి.క్రియేషన్స్ కి చెందిన కీలక వ్యక్తి విక్కీ బాగా క్లోజ్. చరణ్ సినిమాల పంపిణీ హక్కుల్ని యు.వి.క్రియేషన్స్ గంపగుత్తగా కొనేయడం వెనక విక్కీ రోల్ చాలా పెద్దదేనన్న చర్చ సాగుతోంది.
రంగస్థలం నైజాం హక్కుల్ని యు.వి.క్రియేషన్స్ చేజిక్కించుకోవడానికి విక్కీనే కారణం. అలానే ప్రస్తుతం ఆన్ సెట్స్ ఉన్న చరణ్ - బోయపాటిల ఆర్ సి 12 తెలుగు రాష్ట్రాల హక్కుల్ని యు.వి.క్రియేషన్స్ ఛేజిక్కించుకోవడానికి విక్కీనే కారణమని తెలుస్తోంది. అంతేకాదు.. యువి క్రియేషన్స్ బ్యానర్ లో చరణ్ తో ఓ సినిమాని నిర్మించాలన్నది విక్కీ డ్రీమ్ అట. మొత్తానికి ముగ్గురు ఫ్రెండ్స్ ఓ చోట కలిశారు. కలిసిన సందర్భం ఏంటి? అంటే .. విక్కీ బర్త్ డే.
ఇదిగో బర్త్ డేబోయ్ కి విషెస్ చెబుతున్నారు చరణ్ -శర్వా. ఈ సందర్భంలో రామ్ చరణ్ - శర్వానంద్ ఇద్దరినీ చూస్తే.. స్వామి అయ్యప్ప మాల ధారణ చేశారని అర్థమవుతోంది. స్నేహితుడికి పుష్పగుచ్ఛం అందించి - చాక్లెట్లు పంచారు ఆ ఇద్దరూ. రామ్ చరణ్ ప్రతియేటా అయ్యప్ప స్వామి మాలను ధరించి భక్తుడిగా కనిపిస్తుంటారు. ధ్యానం ద్వారా ఇంద్రియాల్ని అదుపులో ఉంచుకోవడం, ఒత్తిడిని జయించడం నేటి బిజీ లోకంలో తప్పనిసరి.. అని చెప్పకనే చెబుతుంటారు చరణ్. దానినే శర్వా కూడా అనుసరిస్తున్నట్టే కనిపిస్తోంది... స్వామి శరణం.