Begin typing your search above and press return to search.

చెర్రీ-ఉప్సీ.. హిమపాతాల్లో హాలిడేస్

By:  Tupaki Desk   |   27 Dec 2017 4:17 PM GMT
చెర్రీ-ఉప్సీ.. హిమపాతాల్లో హాలిడేస్
X
టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ కపుల్స్ లో ఒకరు రామ్ చరణ్ అండ్ ఉపాసన దంపతులు అని చెప్పే తీరాలి. ఎందుకంటే ఈ మెగా కపుల్స్ ఒక్కటై దాదాపు ఐదేళ్ళు పూర్తి కావొస్తోంది. ఇన్నేళ్ల లో వారు ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ తెచ్చుకోకుండా చాలా హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేశారు. సాదారణంగా ఉన్నతమైన కుటుంబాలలో భార్య భర్త అన్యోన్యంగా ఉండడం చాలా అరుదు అని మాట్లాడుకునే రోజుల్లో చెర్రీ-ఉప్సీ బంధం ఇతరులకు ఆదర్శంగా నిలిచిందని చెప్పాలి.

ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడంలో వారికి వారే సాటి. విజయాలు ఎన్ని వస్తున్నా సంపద ఎంత పెరిగినా వారి ప్రేమలో మాత్రం ఎలాంటి తేడా రాలేదు. ఇద్దరు పెద్దలు నిర్ణయించిన వివాహాన్నే చేసుకున్నారు. ఇక ఆ తరువాత ప్రేమ పక్షుల్లా దేశ విదేశాలలో విహరిస్తూ ఆనందంగా గడుపుతున్నారు. ముఖ్యంగా ఉపాసన ఎంతో జాగ్రత్తగా ఇటు భర్తని చూసుకుంటు అటు బిజినెస్ వ్యవహారాలను లను కూడా చక్కగా ప్లాన్ చేసుకుంటోంది. అంతే కాకుండా చరణ్ సినిమాల గురించి సోషల్ మీడియాలో ప్రమోషన్స్ కూడా చేస్తుంటుంది. ఇక వారి వ్యక్తిగత సంతోషాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. ఇక హాలిడేస్ ని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు.

ఇక ప్రస్తుతం క్రిస్మస్ సందర్భంగా ఇద్దరు చల్లని మంచు కురిసే దేశాల్లో హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన స్లో మోషన్ విడియో ను ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హిమపాతాల్లో అలా చరణ్‌ మూమెంట్స్ చూసి అభిమానులు ఎక్సయిట్ అవుతున్నారు.

For Video : https://twitter.com/upasanakonidela