Begin typing your search above and press return to search.

మెగా యంగ్‌ గ్యాంగ్‌.. ఫుల్‌ యాపీస్‌

By:  Tupaki Desk   |   19 Jan 2016 5:03 PM GMT
మెగా యంగ్‌ గ్యాంగ్‌.. ఫుల్‌ యాపీస్‌
X
యాపీస్‌.. యాపీస్‌.. ఎటు చూసినా ఫుల్‌ హ్యాపీస్‌. ప్రస్తుతం యంగ్‌ మెగా వారసులందరూ ఫుల్‌ ఖుషీలో తేలుతున్నారు. ఇంతకీ అకేషన్‌ ఏంటండీ ఇలా చేయడానికి? అబ్బే ఏం లేదండీ.. ఈ మంగళవారం వరుణ్‌ తేజ్‌ పుట్టినరోజు కదా.. ఆ సందర్భంగా ఇలా మెగా కజిన్స్‌ అందరూ కలిశారంతే. అయితే ఇక్కడే ఓ విషయంపై పక్కా క్లారిటీ వచ్చేసింది.

మొన్న లోఫర్‌ సినిమా ఆడియో లాంచ్‌ కు అసలు మెగా హీరోలు ఎవ్వరూ రాలేదు. ఎందుకు అస్తమానం అందరూ రావడం అని నేనే వద్దన్నా అంటూ చెప్పుకొచ్చాడు వరుణ్‌. కాని ఆ మాటను ఎవ్వరూ నమ్మలేదు. అసలు వరుణ్‌ చెల్లెలు.. మెగా డాటర్‌ నిహారిక హీరోయిన్‌ గా తెరంగేట్రం చేయడం మెగా ఫ్యామిలీలో ఎవ్వరికీ ఇష్టం లేదని.. అందుకే వీళ్లందరూ ఎగ్గొట్టారని అప్పట్లో రూమర్‌. అయితే ఆ తరువాత వరుణ్‌ ఎన్నోసార్లు మెగాస్టార్‌ తో కలసి ఎన్నో ఫోటోలకు ఫోజులిచ్చాడు. మొన్ననే గోవాలో సన్‌ బర్న్‌ ఫెస్టివల్‌ లో కూడా కలసి ఎంజాయ్‌ చేశారు. అయినా జనాలు నమ్మితేగా.

ఇప్పుడు వరుణ్‌ బర్తడే నాడు విష్‌ చేయడానికి చరణ్‌, సాయిధరమ్‌ ఏకంగా ఈ కంచె కుర్రాడి ఇంటికి వెళ్లారు. అక్కడ చరణ్‌ అమితంగా నిహారికపై కురిపిచంచిన లవ్‌ ఆ ఫోటోలు చూస్తే అర్ధమైపోతుంది. అంటే.. గతంలో నిహారిక చెప్పిందే నిజం అనమాట. మా ఫ్యామిలీ అంతా గో అన్నాకే నేను హీరోయిన్ అయ్యాను అని చెప్పింది. హ్యాపీస్‌ ఎండింగ్స్‌!!