Begin typing your search above and press return to search.

ఎనర్జీ స్టార్ కి కన్ఫ్యూజన్ పెరిగింది

By:  Tupaki Desk   |   21 Nov 2015 4:02 PM GMT
ఎనర్జీ స్టార్ కి కన్ఫ్యూజన్ పెరిగింది
X
హీరో రామ్ సూపర్ స్పీడ్ మీద ఉన్నాడు. ఎంతగా అంటే శివమ్ ఫ్లాప్ అయినా.. దాన్నుంచి వెంటనే కోలుకున్నట్లుగా కనిపించాడు. చకచకా మరో ప్రాజెక్ట్ ని పూర్తి చేసేశాడు కూడా. ఎలాగైనా తన ఎనర్జీకి తగ్గ హిట్ కొట్టాలన్న తాపత్రయంతో రామ్ చేస్తున్న ప్రయోగాలు కొంచెం బెడిసి కొడుతున్నాయి. దీంతో ఇప్పుడు సెట్స్ పై ఉన్న ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

రామ్ - కీర్తి సురేశ్ జంటగా స్రవంతి మూవీస్ బ్యానర్ పై ఓ మూవీ షూటింగ్ ఫినిషింగ్ దశకు చేరుకుంది. ఈ మూవీకి ముందు హరికథ అనే టైటిల్ అనుకున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా చెప్పకపోయినా .. ఇది కన్ఫాం అని యూనిట్ వర్గాలు చెప్పాయి అప్పట్లో. అయితే శివమ్ ఫ్లాప్ తర్వాత ఎక్కువ కేర్ తీసుకున్న రామ్.. ఈ చిత్రంలో కొన్ని కీలక మార్పులు దగ్గరుండి చేయించాడు. వాటిలో భాగంగా ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లుగా నేను శైలజ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా వార్తలొచ్చాయి.

కానీ ఇప్పడు లేటెస్ట్ న్యూస్ ఒకటి చెప్పింది యూనిట్. ఈ నెల 21న మొదలుపెట్టి 29వరకూ ఓ సాంగ్ పిక్చరైజ్ చేయబోతన్నారట. దీంతో గుమ్మడికాయ కొట్టేయబోతున్నామని చెప్పారు. మంచి టైటిల్ ని ఆలోచిస్తున్నామని కూడా అనడం విశేషం. అదేంటీ మరి రెండు టైటిల్స్ ఉన్నాయిగా అంటే.. మేం అనౌన్స్ చేయలేదు, అవన్నీ మీడియా క్రియేషన్ అంటునారు మేకర్స్. బాగుంది వరస.. వీళ్లు ఏం చెప్పకుండానే వీళ్ల సినిమాకి వేరేవాళ్లు పేరు పెట్టేసి ప్రచారం చేసేస్తారా ఏంటి ?