Begin typing your search above and press return to search.

ఎనర్జిటిక్ హీరో వండేస్తున్నాడు!!

By:  Tupaki Desk   |   22 May 2018 6:21 AM GMT
ఎనర్జిటిక్ హీరో వండేస్తున్నాడు!!
X
సినిమా హీరోలకు కూడా సరదాలు ఉంటాయి. ఇక్కడ వాటిని తీర్చుకోవడం సాధ్యం కాకపోతే.. ఎంచక్కా ఫారిన్ కంట్రీస్ చెక్కేసి అక్కడ తమ ఫ్యాంటసీలను పూర్తి చేసుకుంటూ ఉంటారు. చాలామంది యంగ్ హీరోల మాదిరిగానే రామ్ కు కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్లడం అంటే ఇష్టం.

అయితే.. ఇతడికి ఆయా దేశాల్లో కొన్ని వారాలు గడపడం అనే హ్యాబిట్ కూడా ఉంది. గతంలో శివం మూవీ షూటింగ్ కు నార్వే వెళ్లి వచ్చిన తర్వాత.. ఆ ప్రాంతంపై మక్కువ పెంచుకున్న ఎనర్జిటిక్ హీరో.. మళ్లీ నార్వే వెళ్లి కొన్ని వారాల పాటు అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత కూడా ఇలాంటివి కంటిన్యూ చేసిన రామ్.. ఇప్పుడు స్పెయిన్ లో గడుపుతున్నాడు. కొన్ని వారాలుగా ఒక విద్యార్ధి మాదిరిగా స్పెయిన్ లో గడుపుతున్నట్లుగా చెప్పుకొచ్చిన రామ్.. అనేక మంది కొత్త వ్యక్తులను కలవడం.. తన పనులు తనే చేసుకోవడం వంటివి చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

ఇంతకీ మన హీరో అక్కడ విద్యార్ధిగా మారిపోయి ఏం చేస్తున్నాడనే కదా మీ డౌట్. ఆ విషయాన్ని కూడా ఒక్క ఫోటో రూపంలో చెప్పకనే చెప్పాడు రామ్. అక్కడ వంట క్లాసులకు అటెండ్ అవుతూ.. తెగ నేర్చేసుకుంటున్నాడట. తన పనులు తనే చేసుకోవడం అంటే.. తన వంటను తనే వండేసుకుంటున్నాడన్న మాట. ఇక సినిమాల విషయానికి వస్తే.. హలో గురూ ప్రేమ కోసమే అనే చిత్రాన్ని రిలీజ్ కి రెడీ చేస్తున్న రామ్.. త్వరలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.