Begin typing your search above and press return to search.

ఈ మెరుపు వీరుడిని గుర్తు పట్టారా?

By:  Tupaki Desk   |   23 Sep 2015 1:30 PM GMT
ఈ మెరుపు వీరుడిని గుర్తు పట్టారా?
X
శివంతో వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రానున్న రామ్.. ఓ పోస్టర్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. పూర్తి లైటింగ్ నే బేస్ చేసుకుని.. ఓ కేరక్టర్ ని డిజైన్ చేసిన పోస్టర్ ని పోస్ట్ చేసి.. ఎవరో గుర్తు పట్టారా అంటున్నాడు. అఫ్ కోర్స్ అది రామ్ అని అర్ధమవుతున్నా.. వినూత్నంగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ మాత్రం భలే ఎట్రాక్టివ్ గా ఉంది.

ఫ్యాషన్ కి కేరాఫ్ అడ్రస్ గా కనిపించే హీరో రామ్... టెక్నాలజీ ట్రెండ్స్ లోనూ అప్ డేటెట్ గానే ఉంటాడు. అలాగే పబ్లిసిటీ విషయంలో కూడా. అందుకే పండగ చేస్కోతో సైలెంట్ హిట్ కొట్టేశాడు. ఇప్పుడు శివంతో మరో సక్సెస్ సాధించేందుకూ సిద్ధంగా ఉన్నాడు. సినిమాపై అంచనాలు బాగానే ఉన్న సమయంలో.. క్రిష్ రూపొందించిన కంచె లాంటి ప్రెస్టీజియస్ మూవీ వాయిదా పడ్డం.. రామ్ కి కలిసొచ్చే విషయంగా మారింది. అక్టోబర్ 2న రిలీజ్ చేయబోతున్నారు ఈ మూవీని. దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ ఇప్పటికే.. బాగా క్లిక్ అయింది.

ఇది రిలీజ్ కాగానే.. హరికథ మూవీపై ఫుల్ గా కాన్సంట్రేట్ చేయబోతున్నాడు ఎనర్జిటిక్ హీరో రామ్. ఇప్పటికే సగ భాగం షూటింగ్ కంప్లీట్ అయిన ఈ మూవీకి.. తిరుమల కిషోర్ డైరెక్ట్ చేస్తుండగా.. స్రవంతి రవికిషోర్ నిర్మాత. శివం, హరికథ చిత్రాలు రెండూ స్రవంతి బ్యానర్ పైనే రూపొందడం విశేషం.