Begin typing your search above and press return to search.

హిట్ డైరెక్టర్ వద్దు.. ఫ్లాప్ డైరెక్టరే ముద్దు

By:  Tupaki Desk   |   21 Sep 2016 10:30 PM GMT
హిట్ డైరెక్టర్ వద్దు.. ఫ్లాప్ డైరెక్టరే ముద్దు
X
మామూలుగా హీరోలు సక్సెస్ లో ఉన్న దర్శకుడినే ప్రిఫర్ చేస్తారు. ఫ్లాప్ డైరెక్టర్లను.. ఫామ్ లో లేని వాళ్లను దూరం పెడతారు. కానీ యంగ్ హీరో రామ్ మాత్రం దీనికి భిన్నంగా నడుస్తున్నాడు. కొన్నేళ్ల పాటు ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడిన రామ్.. తమిళంలో.. తెలుగులో ఒక్కో సినిమా చేసి ఫ్లాపులు ఎదుర్కొన్న కిషోర్ తిరుమలతో జట్టు కట్టి ‘నేను శైలజ’ లాంటి మంచి విజయాన్నందుకున్నాడు. ఆ తర్వాత ‘రభస’ లాంటి డిజాస్టర్ తీసిన సంతోష్ శ్రీనివాస్ తో ‘హైపర్’ చేశాడు. దీని తర్వాత రామ్.. పటాస్.. సుప్రీమ్ లాంటి హిట్లతో జోరుమీదున్న అనిల్ రావిపూడితో సినిమా చేయాల్సింది. అంతా ఓకే అనుకున్నాక ఈ సినిమాకు బ్రేక్ పడింది.

పారితోషకం విషయంలో రామ్ బెట్టు చేయడంతో నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను ఆపేయాలని భావించినట్లు వార్తలొచ్చాయి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. రామ్ తన తర్వాతి సినిమాను కరుణాకరన్ దర్శకత్వంలోనే చేయడానికి ఫిక్సయ్యాడు. క్రేజీ ఫీలింగ్ అనే టైటిల్ తో ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది. రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోరే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. అంటే వరుసగా మూడో సినిమా కూడా ఫ్లాప్ డైరెక్టర్ తోనే చేయబోతున్నాడన్నమాట రామ్. ‘హైపర్’ హిట్టయితే.. ఫ్లాప్ డైరెక్టర్లతో పని చేయడం సెంటిమెంటుగా మారి.. వరుసగా ఆ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తాడేమో రామ్. కరుణాకరన్ ఇంతకుముందు రామ్ తో తీసిన ‘ఎందుకంటే ప్రేమంట’ పెద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.