Begin typing your search above and press return to search.
ఆ పాట కోసం చాలా కష్టపడ్డాం -రామ్
By: Tupaki Desk | 2 Oct 2015 4:59 AM GMTహీరో రామ్ నటించిన శివమ్ ఈ రోజు రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎగ్జోటిక్ లొకేషన్స్.. సాంగ్స్ ప్రస్తుతం హాట్ టాపిక్. ముఖ్యంగా 'అందమైన లోకం' సాంగ్ గురించే ఇప్పుడు టాలీవుడ్‌లో డిష్కసన్. ఈ పాటలో రామ్ సాహసోపేతమైన బైక్ జర్నీ చేశాడన్నది హాట్ టాపిక్. ఇదో రొమాంటిక్ సాంగ్ అయినా .. రామ్ - రాశీ ఖన్నా జోడీ ఓ ప్రమాదరకమైన సముద్రపుటంచులో.. ఈ పాట కోసం బైక్ రైడ్ చేశారు. ప్రమాదకర నార్వే సీ నుంచి సముద్రపు అలలు రోడ్డుకు తన్నుకొస్తునా .. ఆ మెలికలు తిరిగిన రోడ్ లో రామ్ ఐదే మైళ్ల దూరాన్ని 15 సార్లు చక్కర్లు కొట్టాడు.
100 టన్నుల బరువు అనిపించేంతటి ఠఫ్ జర్నీ ఇది. పైగా చిదిగిపోయిన బొటనవేలు ఓ వైపు నొప్పితో వేధించింది. అలానే హార్లీ డేవిడ్ సన్ పై ఆ రైడ్‌ని బాగా ఆస్వాధించానని చెబుతున్నాడు రామ్. అలాంటి అనుభవాన్ని, అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేనని అంటున్నాడు. కొండచిలువలా మెలికలు తిరిగిన ఆ రోడ్ లో తాను బైక్ రైడ్ చేస్తున్నప్పుడు ఎయిర్ లో డ్రోన్ కెమెరా ఒకటి తమని అనుసరించేదని రామ్ చెప్పాడు.
ఓవైపు కెమెరా కళ్లు వెంబడిస్తున్నా.. డ్రోన్ వెంటాడుతున్నా .. ఆ పాట కో్సం ఎంతో రొమాంటిక్ గా కనిపించాలి. హీరోయిన్ తో పెనవేసుకుపోవాలి. అదంతా సక్సెస్ ఫుల్ గా చేశానని రామ్ చెబుతున్నాడు. ఆ రోడ్ లో అన్నిసార్లు రౌండ్లు వేయడం మర్చిపోలేనని అంటున్నాడు. మరి కాసేపట్లో ఆ నార్వే సీ.. మెలికల రోడ్ ని మనం కూడా థియేటర్లలో చూసేయొచ్చు. ఆ జర్నీలో రామ్ స్థానంలో మనల్ని మనం ఊహించుకోవచ్చు. ఇంకెందుకాలస్యం? శివమ్ చూసేద్దాం పదండి.