Begin typing your search above and press return to search.
నాగబాబుకి తేలు పిల్ల కుట్టిందా లేక వాన పాము కరిచిందా?
By: Tupaki Desk | 9 Jan 2017 8:17 AM GMTసంబరంగా జరుగుతున్న చిరంజీవి ఖైదీ నెంబరు 150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని చిన్న సైజు యుద్దవాతావరణంగా మార్చారు నాగబాబు! మైక్ అందుకున్న నాగబాబు వర్మ - యండమూరి లను సీరియస్ గా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అక్కుపక్షి - పనికిమాలిన సన్నాసి అని తిట్టడం దగ్గరనుంచి చాలా దూరమే వెళ్లిపోయారు నాగబాబు. దీంతో వర్మ చాలా హర్ట్ అయ్యారని తన ట్వీట్లలో తెలుస్తూనే ఉంది! నాగబాబు కామెంట్స్ అనంతరం ట్వీట్ల దండకం అందుకున్న వర్మ నేటికీ వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఏమాత్రం విరామం దొరికినా అన్నట్లు... ట్విట్టర్ ఓపెన్ చేసిన ప్రతిసారీ నాగబాబు ని ఏదో ఒకటి అనేసి పోతున్నారు. అయితే ఇంతకాలం తన ట్వీట్లలో మెగాఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వస్తున్న వర్మ ఈ వ్యవహారానికి బాలయ్య బాబు అభిమానుల సపోర్ట్ ఆశిస్తున్నాడనే సంకేతాలు తాజా ట్వీట్లలో అంతర్లీనంగా ధ్వనిస్తున్నాయనే చెప్పాలి!
ముందుగా గౌతమిపుత్ర సినిమా గొప్పతనం గురించి - ఆ సినిమా డైరెక్టర్ క్రిష్ కి బాలీవుడ్ వేదికగా వస్తున్న ఆఫర్ల గురించి ఏకదాటిగా పొగడటం మొదలుపెట్టిన వర్మ... క్రిష్ నెక్స్ట్ మూవీస్ అమీర్ ఖాన్ - షారుక్ ఖాన్ లతో అని చెప్పుకొచ్చాడు. ఆ సంగతులు అలా ఉంటే... మరోసారి ఖైదీ నం.150 - గౌతమిపుత్ర శాతకర్ణి ల మధ్య పోలీకలు - తేడాలు చెప్పడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో క్రిష్ తో "మీరు నిజంగా అంజనా పుత్రుడైతే.. చిరంజీవి - బాలకృష్ణలో ఎవరు గొప్ప అనేది చెప్పి తీరాలి" అని అడిగాడు. అయితే ఈ తాజా రొచ్చు లోకి క్రిష్ ని కూడా లాగడానికి వర్మ ట్రై చేస్తున్నాడనె కామెంట్స్ వినిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజా ట్వీట్లతో రాం చరణ్ - రానా లను కూడా ఈ డిస్కషన్ లోకి లాగే ప్రయత్నం చేశాడు వర్మ!
చిరంజీవి 150 సినిమా ట్రైలర్ చాలా బాగుందని చెబుతూ చరణ్ ని దగ్గుబాటి రాణా కంగ్రాచ్యులేట్ చేస్తే... దానిని కోట్ చేస్తూ రాణాని డిస్కషన్ లోకి లాగే ప్రయత్నం చేశాడు వర్మ. "నాకు కూడా ఈ ట్రైలర్ బాగా నచ్చింది సర్" అంటూ రానా ట్వీట్స్ పై స్పందించాడు. అయితే రాణా - వర్మ ట్వీట్ పై మరేమీ స్పందించకపోవడం గమనార్హం! ఆ రాత్రి ప్రసంగం అనంతరం నాగబాబుపై వర్మ నిత్యం ఏదో ఒక ట్వీట్ తో విరుచుకుపడుతున్నా... నాగబాబు నుంచి ఏమీ రియాక్షన్ రాకపోయే సరికి మరింతగా గుచ్చిన వర్మ... నాగబాబుకి తేలు పిల్ల కుట్టిందా లేక వాన పాము కరిచిందా అంటూ మరోసారి గిచ్చే ప్రయత్నం చేశాడు. నిన్నమొన్నటివరకూ ఒక మోస్తరుగా సాగిన వర్మ - మెగా ఫ్యామిలీ మధ్య లవ్ సీన్స్ - తాజా పరిస్థితులతో క్లైమాక్స్ కి వచ్చేసినట్లేననే కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/