Begin typing your search above and press return to search.

ఒకే ఫ్లైట్ లో వర్మ, దేవినేని

By:  Tupaki Desk   |   26 Feb 2016 12:07 PM GMT
ఒకే ఫ్లైట్ లో వర్మ, దేవినేని
X
వంగవీటి మూవీ కోసం రామ్ గోపాల్ వర్మ విజయవాడ వస్తున్నానని చెప్పాడు.. చెప్పినట్లే వచ్చాడు కూడా. వర్మ రాక కోసం విజయవాడలో వంగవీటి అభిమానులు భారీ ఏర్పాట్లు, కటౌట్లతో హంగామా కూడా చేశారు. వర్మను ర్యాలీగా తీసుకెళ్లేందుకు వంగవీటి అనుచరులు ర్యాలీకి సిద్ధం కాగా.. ఇందుకు వ్యతిరేకంగా దేవినేని అనుచరగణం కూడా ర్యాలీ చేపట్టారు.

అన్నిటికంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. వర్మ తాను ఏ ఫ్లైట్ లో వస్తానని చెప్పాడో అదే సర్వీస్ లో గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకున్నాడు. అయితే, ఇదే విమానంలో దేవినేని నెహ్రూకూడా రావడం విశేషం. ఒకే ఫ్లైట్ లో వీరిద్దరూ రానున్నారన్న సమాచారంతో గన్నవరం ఎయిర్ పోర్ట్ కోలాహలంగా మారిపోయింది. నెహ్రూ కోసం ఓ అంబాసిడర్ - ఆయన కొడుకు అవినాష్ ల కార్లతో వెయిట్ చేయగా.. వర్మను పికప్ చేసుకునేందుకు రెండు ఫార్చూనర్లను రెడీగా ఉంచారు. మొత్తానికి ఎయిర్ పోర్టుకు చేరుకున్న వర్మ.. కారులో వెళ్లేముందు మీడియాతో కాసిని మాటలు మాట్లాడాడు.

'ఫ్లైట్ లో నెహ్రూతో నేను ఏం మాట్లాడలేదు. ఆయన ఉన్నాడని కూడా నాకు తెలీదు. నేనిక్కడ మూడు రోజులు ఉంటాను. సినిమాలో కేరక్టర్లకి సంబంధించిన అందరితోనూ మాట్లాడతాను'అంటూ చెప్పేసి వెళ్లిపోయాడు వర్మ. రాంగోపాల్ వర్మ విజయవాడకు చేరుకోవడంతో.. ఇప్పుడక్కడ పరిస్థితి మరింత వేడిగా తయారైంది.