Begin typing your search above and press return to search.
వర్మ-కీరవాణి.. ఒక ఆసక్తికర సంభాషణ
By: Tupaki Desk | 27 March 2017 5:03 AM GMTఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తెగ పొగిడేసి అతడి అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తాడు రామ్ గోపాల్ వర్మ. కానీ గత కొంత కాలంగా వర్మ తీరు మారింది. తాను పవన్ కు వీరాభిమానినని పదే పదే చెబుతూనే.. పవన్ గాలి తీసే ప్రయత్నంలో బిజీగా ఉంటున్నాడు వర్మ. తాజాగా ఆయన ఫోకస్ ‘కాటమరాయుడు’పై పడింది. ఈ సినిమా విషయంలో ఆయన ట్రోలింగ్ మామూలుగా లేవు. ఈ క్రమంలో పవన్ వ్యక్తిగత జీవితం పైగా కొన్ని సెటైర్లు వేశాడు వర్మ. దీంతో పవన్ అభిమానులు ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇంతకుముందు వర్మ చేసిన ట్వీట్లను లైట్ తీసుకున్న వాళ్లు.. సపోర్ట్ చేసిన వాళ్లు.. ఎంజాయ్ చేసిన వాళ్లు కూడా ఇప్పుడు ఆయన మరీ శ్రుతి మించి పోయారనే అభిప్రాయపడుతున్నారు. ఆయన్ని విమర్శిస్తున్నారు.
ఇలాంటి టైంలో సంగీత దర్శకుడు కీరవాణి.. వర్మ మీద ప్రశంసలు కురిపించారు. ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఆడియో వేడుకకు ముందు చాలా ఎమోషనల్ గా.. ఓపెన్ గా ట్వీట్ల వర్షం కురిపించాడు కీరవాణి. ఇందులో ఒకట్రెండు చోట్ల వర్మ ప్రస్తావన కూడా వచ్చింది. లెక్కలేనన్ని ఫ్లాపులు తీసినప్పటికీ ఆర్జీవీ అందరిలోకి పెద్ద మేధావే అని కితాబిచ్చాడు కీరవాణి. వర్మ సినిమా ‘క్షణక్షణం’ సినిమా కోసం తాను ట్యూన్ చేసిన ‘జామురాతిరి..’ పాట ఎవర్ గ్రీన్ అని కూడా కీరవాణి తెలిపాడు. అలాగే తనను చీప్ ప్రొడక్షన్లలో పని చేయొద్దని వర్మ తనకు సలహా ఇచ్చాడని.. కానీ దాన్ని తాను పాటించలేదని.. ఒకప్పుడు తనకు ఆ సలహా ఇచ్చిన వర్మ కాలక్రమంలో చెత్త ప్రొడక్షన్లలో సినిమాలు చేశాడని కీరవాణి పేర్కొనడం విశేషం. ఈ ట్వీట్లపై వర్మ స్పందించాడు. తన కెరీర్లో ‘క్షణ క్షణం’ మ్యూజిక్ ఎప్పటికి బెస్టెస్ట్ అని.. అది తన సినిమాలన్నింట్లోకి బాహుబలియెస్ట్ మ్యూజిక్ అని అన్నాడు. కీరవాణి రిటైర్మెంట్ గురించి ప్రస్తావన రావడంపై వర్మ స్పందిస్తూ.. ‘‘మీ తొలి సినిమా నాతోనే చేశారు. చివరి సినిమా కూడా నాతోనే చేయండి. కానీ నేనా సినిమాను ఎప్పటికీ చేయను. కాబట్టి మీరు ఎప్పటికీ రిటైరవ్వరు’’ అంటూ తనదైన శైలిలో చమత్కరించాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/