Begin typing your search above and press return to search.
బోనీ కపూర్ ను ఎప్పటికీ క్షమించను- వర్మ
By: Tupaki Desk | 1 Dec 2015 11:52 AM GMTశ్రీదేవి అన్న పేరెత్తితే ఇక ఆగలేడు రామ్ గోపాల్ వర్మ. తన ఆరాధ్య దేవత గురించి ఎంత మాట్లాడినా అతడికి తనివి తీరదు. శ్రీదేవి అందం గురించి, ఆమె మీద తనకున్న అభిమానం గరించి ఓ తన్మయత్వంతో మాట్లాడే వర్మ.. ఆమె భర్త బోనీ కపూర్ ప్రస్తావన వస్తే మాత్రం మండిపోతాడు. తన మాటలు విని శ్రీదేవి ఏమనుకుంటుందో అని కూడా ఆలోచించకుండా అతడిపై విరుచుకుపడుతుంటాడు. ఇంతకుముందు ‘నా ఇష్టం’ పుస్తకంలో శ్రీదేవి మీద ఓ స్పెషల్ చాప్టర్ రాసిని వర్మ.. తన తాజా పుస్తకం ‘గన్స్ అండ్ థైస్’లోనూ ‘గాడెస్ ఆఫ్ బ్యూటీ’ పేరుతో శ్రీదేవికి ఓ చాప్టర్ కేటాయించాడు.
అందులో శ్రీదేవి మీద తన అభిమానాన్నంతా చాటుకున్న వర్మ.. బోనీ మీదా ధ్వేషాన్ని కూడా చూపించాడు. ‘‘బోనీ కపూర్ కిచెన్ లో శ్రీదేవి టీ పెడుతుండటం చూసి విస్మయానికి గురయ్యాను. దివిలో ఉన్న ఓ దేవతను తన అపార్ట్ మెంట్ లోని కిచెన్ స్థాయికి దించేసిన బోనీ కపూర్ ను నేను ఎప్పటికీ క్షమించను’’ అని వర్మ రాసుకున్నాడు. శ్రీదేవి మీద తనకు ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ఆమె స్థాయికి తాను తగనన్న ఉద్దేశంతో ఆమెకు ఎప్పుడూ ప్రపోజ్ చేయలేదని.. ఐతే ఆమె బోనీ కపూర్ లాంటి సెకండ్ హ్యాండ్ హజ్బెండ్ ని పెళ్లాడాక తనకేం తక్కువ అనిపించిందని గతంలో వర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.