Begin typing your search above and press return to search.

చిరు సినిమాపై రామూ రచ్చ

By:  Tupaki Desk   |   18 Oct 2015 5:57 AM GMT
చిరు సినిమాపై రామూ రచ్చ
X
సాయింత్రం అవుతుంది.. కూల్ ఐస్ క్యూబ్స్ తో కలిసిన హాట్ పెగ్ రమ్మని పిలుస్తుంది. పక్కనే తానా అంటే నేనూ తనన్నా అనే భజన పార్టీ ఒకటుంది. ఇక మిగిలింది మంచింగే.. అయితే ఇంతటి బ్యాక్ డ్రాప్ పెట్టుకుని ఆర్జీవి లాంటి ఘనుడు ఏ చిప్స్ నో, కోడి పకోడీనో మంచింగ్ గా తీసుకుంటే కిక్కేముంటుంది అనుకుంటాడో ఏమో.. ఏదో ఒక ఫిలిం న్యూస్ ని తనదైన స్టైల్ లో కెలికి ప్రజల బుర్రలను మంచింగ్ చేస్తూ ఆదేదో ఆనందం అంటారుగా అది సాధిస్తాడు..

నిన్నటివరకూ బ్రూస్ లీ సినిమాపై నానా విధాలుగా సెటైర్ లు సంధించిన రామూ నిన్న మరోసారి మెగా ఫ్యామిలీపై పడ్డాడు. మధ్యాహ్నం చరణ్ - పవన్ ఫోటోని ట్వీట్ చేస్తూ వీరి కాంబినేషన్ లో సినిమా అంటే బాహుబలిలకే బాహుబలి గా వుంటుంది అని ఆకాశానికి ఎత్తేశాడు. ఇక రాత్రి చిరు 151వ సినిమాపై విరుచుకుపడ్డాడు.

చిరంజీవి లాంటి స్టార్ 151 వ ప్రాజెక్ట్ కోసం తమిళ కధను ఎత్తుకోవడం అసలు ఊహించలేదని సెలవిచ్చాడు. చిరు జీరో స్టేజ్ లో వున్న సమయంలో కూడా ఎన్.టి.ఆర్, ఏ.ఎన్ ఆర్ ల స్టోరీలను కాపీ కొట్టలదని, ఇప్పుడిలా తమిళ కధలను కాపీ కొట్టడంతో తెలుగు పరిశ్రమని ఎగతాళి చేసినట్టేననితెలిపాడు . నువ్వు కూడా కాపీ కొట్టావ్ కదా అని వినిపించిన విమర్శలకు బదులుగా తానేమో తెలుగు ప్రజల లీడర్ ని కానని, తానూ కాపీ కొట్టడంలో గొప్ప విషయమేమీ లేదని, చిరు మాత్రం ఇలా చేయడం జీర్ణించుకోలేని విషయమని ట్వీటిచ్చాడు...