Begin typing your search above and press return to search.

వోడ్కా మానేశా.. సారీ పవన్ ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   12 April 2017 6:16 AM GMT
వోడ్కా మానేశా.. సారీ పవన్ ఫ్యాన్స్
X
అసలు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటేనే 'వోడ్కా' కి బ్రాండ్ అంబాసిడర్. మనోడు రోజూ రాత్రి పూట వోడ్కా తాగేసి ఇష్టం వచ్చినట్లు ట్వీట్లేస్తాడని ఊరందరికీ తెలిసిందే. స్వయంగా నాగార్జున వంటి పెద్ద హీరోలు కూడా వర్మ వోడ్కా తాగి వేసే ట్వీట్లను ఎంజాయ్ చేస్తామంటూ పేర్కొన్నారు. అయితే ఇప్పుడు వీరందరికీ గుండె పగిలిపోయే షాకింగ్ న్యూస్ ఒకటి చెప్పేశాడు. ఆయన ట్వీట్లతో ఆనందిస్తున్న వారికి నిరాశనే మిగిల్చాడు.

''ఇప్పుడే నేను వోడ్కా మానేద్దాం అని డిసైడయ్యాను. ఇక మీదట తాగనంటే తాగను. ఇప్పటివరకు నా వోడ్కా కారణంగా ఇబ్బంది పడిన వినాయకుడి అభిమానులకు.. పవన్ కళ్యాణ్‌ అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాను'' అంటూ సెలవిచ్చాడు. అయితే వర్మ ఇలాంటి వోడ్కా మానేసిన ట్వీట్లను చాలాసార్లు గతంలో కూడా వేశాడులే. తెల్లారి నిద్రలేవగానే నేను వోడ్కా తాగి రాత్రి ఏదో ట్వీట్ వేశాను.. దయచేసి నమ్మొద్దు అంటూ క్లారిటీలు కూడా ఇచ్చేశాడు.

''మీరు ఏమన్నా అనుకోండి.. నేను ఇప్పుడే కొత్తగా పుట్టినట్లు. నేను దేవుడ్ని నమ్మను కాబట్టి.. మా అమ్మ మీద.. దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ మీద.. అమితాబ్ బచ్చన్ మీదనా ఒట్టేస్తున్నా'' అంటూ కూడా సెలవిచ్చాడు వర్మ. కాని ఇవన్నీ అభిమానులు నమ్మడం లేదులే. ఎప్పుడెప్పుడు వర్మ ఈ ప్రమాణాలను బ్రేక్ చేసి మరోసారి సంచలనాత్మక ట్వీట్లు వేస్తాడా అంటూ అందరూ ఎదురు చూస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/