Begin typing your search above and press return to search.

ఎవరికో కాలేలా వర్మ ట్వీటు

By:  Tupaki Desk   |   12 Feb 2018 4:11 AM GMT
ఎవరికో కాలేలా వర్మ ట్వీటు
X
ఏదో రచ్చ లేనిదే నిద్ర పట్టని వర్మ ఇప్పుడు కొత్తగా సూపర్ స్టార్ రజనికాంత్ మీద కూడా పడ్డాడు. కాకపోతే నేరుగా కాదు లేండి. కొద్ది రోజుల క్రితం కాలా రిలీజ్ డే పోస్టర్స్ విడుదలైన సంగతి తెలిసిందే. అందులో రజనికాంత్ స్టైల్ గా కుర్చీ మీద కూర్చుని తన పెంపుడు కుక్క మీద చెయ్యి నిమురుతూ ఉన్న స్టిల్ ఇప్పటికే వైరల్ అయ్యింది. మార్ఫింగ్ చేయడంలో మంచి ఎక్స్ పర్ట్ అయిన వర్మ దీన్ని మాత్రం వదులుతాడా. తలైవా తల తీసి తన తల పెట్టుకుని కింద కాలా పేరు స్థానంలో రామ్ గోపాల్ వర్మ అని ఇంటిపేరుతో సహా వేయించేసుకున్నాడు. ఇంత దాకా ఓకే. బాగానే ఉంది. కాని దానికి పెట్టిన మెసేజ్ సవాలక్ష సందేహాలను రేపుతోంది. ఏది సూటిగా చెబుతాడో ఏది వ్యంగ్యంగా చెబుతాడో తనకే తెలియని వర్మ ఈ సారి మాత్రం పజిల్ లాగా పోస్ట్ చేయటం చర్చగా మారింది.

ఈ ఫోజు నాకు ఒకరిని గుర్తుకు తెస్తోంది. ఎవరో కనిపెట్టడంలో కాస్త మీరేమైనా సహాయం చేస్తారా అనేది వర్మ మెసేజ్. వర్మ అన్నది సూపర్ స్టార్ నా లేక టాలీవుడ్ లో ఎవరో హీరోనో లేక రాజకీయ నాయకుడినో అన్నాడో అర్థం కాక ఫాన్స్ అయోమయం లో పడ్డారు. ఇలాంటి స్టిల్ రజని గతంలో బాషా సినిమాకు మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత అంత పవర్ఫుల్ డాన్ పాత్ర కనిపించడం ఈ సినిమాతోనే మొదలు. మరి వర్మ అది స్పూరించేలా అన్నాడా అంటే అనుమానమే. ఎందుకంటే తన మాటల్లో సెటైర్ ఉంది. ఎవరో గుర్తుకు వస్తున్నారు అంటే వర్తమానంలో ఎవరి గురించో అంటున్నాడు అని అభిమానుల అంచనా. అది వర్మ చెబితేనే క్లారిటీ వస్తుంది కాని కామెంట్స్ లో మాత్రం ఎవరికి తోచినట్టు వాళ్ళు ఊహించేసుకుని పేర్లు పెట్టడం మొదలు పెట్టారు. అజ్ఞాతవాసి పోస్టర్ రిలీజ్ అయినప్పుడు కూడా వర్మ ఇదే తరహలో మార్ఫింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి అందరికి గుర్తే.