Begin typing your search above and press return to search.
వర్మ ఈ శిష్యుడైనా..
By: Tupaki Desk | 22 May 2018 9:38 AM GMTఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమా అన్నా.. ఆయన శిష్యుల సినిమాలన్నా విపరీతమైన ఆసక్తి ఉండేది జనాల్లో. కానీ కాల గమనంలో ఆ ఆసక్తి మొత్తం పోయింది. వర్మకూ క్రేజ్ పడిపోయింది. వర్మ శిష్యుడి సినిమా అన్నా కూడా ఏమంత క్యూరియాసిటీ రావట్లేదు. గత కొన్నేళ్లలో చాలామంది వర్మ శిష్యులు వచ్చారు. వెళ్లారు. ఆల్రెడీ ఉన్నవాళ్లు కూడా ఫామ్ కోల్పోయారు. తాజాగా వర్మ దగ్గర ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమాకు పని చేసిన అజయ్ భూపతి అనే కుర్రాడు దర్శకుడిగా మారి ‘ఆర్ ఎక్స్ 100’ అనే సినిమాను రూపొందించాడు. ఇంతకుముందే కొన్ని పోస్టర్లతో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం తాజాగా థియేట్రికల్ ట్రైలర్ తో ప్రేక్షుకుల ముందుకొచ్చింది. ఇందులో నటించిన హీరో హీరోయిన్లు కొత్తవాళ్లే. అయినప్పటికీ ఈ ట్రైలర్ క్యూరియాసిటీ తీసుకురాగలిగింది.
నిన్నట్నుంచి ‘ఆర్ ఎక్స్ 100’ ట్రైలర్ టాలీవుడ్లో చర్చనీయాంశమవుతోంది. జనాల దృష్టిని కూడా బాగానే ఆకర్షించింది. ఇందులోని కొన్ని విజువల్స్ స్టన్నింగ్ గా అనిపించాయి. ‘అర్జున్ రెడ్డి’ ప్రభావం కూడా కొంత ఇందులో కనిపించింది. రొమాన్స్.. యాక్షన్ సన్నివేశాల్ని చాలా ‘రా’గా చూపించడం ద్వారా ప్రత్యేకత చాటుకునే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ట్రైలర్ అంతటా ఒక ఇంటెన్సిటీ కనిపించింది. కొన్ని షాట్లు దర్శకుడి ముద్రను చూపిస్తున్నాయి. మొత్తంగా వర్మ శిష్యుడైన అజయ్ ట్రైలర్లో తన ముద్ర చూపించగలిగాడు. వర్మతో పాటు పూరి జగన్నాథ్.. కృష్ణవంశీ లాంటి ఉద్ధండులైన ఆయన శిష్యులందరూ ఫేడవుట్ అయిపోయి అస్తిత్వం కోసం పోరాడుతున్న సమయంలో ఈ అజయ్ కొంచెం కొత్తగా ఏదో ట్రై చేసినట్లు కనిపిస్తున్నాడు. వర్మ సినిమా అన్నా.. ఆయన శిష్యుల సినిమాలన్నా భయపడిపోతున్న ఈ రోజుల్లో అజయ్ ‘ఆర్ ఎక్స్ 100’లో హిట్టు కొట్టి వాళ్లందరి మధ్య ప్రత్యేకంగా నిలుస్తాడేమో చూద్దాం.