Begin typing your search above and press return to search.
శ్రీదేవి.. బాహుబలి.. ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్
By: Tupaki Desk | 29 April 2018 7:30 PM GMT‘బాహుబలి’లో రమ్యకృష్ణకు తిరుగులేని పేరు తెచ్చిపెట్టిన శివగామి పాత్ర కోసం ముందు రాజమౌళి శ్రీదేవిని అనుకున్న సంగతి తెలిసిందే. ఐతే ఆమె భారీ పారితోషకం డిమాండ్ చేయడం.. ఇంకా ఏవో షరతులు పెట్టడంతో ఆమె వద్దనుకుని రమ్యకృష్ణను ఎంచుకున్నట్లు రాజమౌళి వెల్లడించాడు. ఈ విషయమై శ్రీదేవి ఒక ఇంటర్వ్యూలో చాలా ఆవేదన వ్యక్తం చేసింది. తాను అలాంటి డిమాండ్లు చేయడం అబద్ధమని చెప్పింది. అసలెవరైనా అలాంటి డిమాండ్లు చేస్తారా.. అలా చేసేదాన్నయితే తాను అంత పెద్ద కథానాయిక అయ్యేదాన్నా అని ప్రశ్నించింది. తన భర్త కూడా ఒక నిర్మాతే అని.. అలాంటపుడు తానెలా అలాంటి డిమాండ్లు చేస్తానని ఆమె అంది. శ్రీదేవి అలా అన్నాక వివాదాన్ని పెద్దది చేయకుండా ఆమెకు సారీ చెప్పి ఫుల్ స్టాప్ పెట్టేశాడు రాజమౌళి.
ఐతే ఈ వ్యవహారానికి సంబంధించి తాజాగా రామ్ గోపాల్ వర్మ ఒక సంచలన విషయం వెల్లడించాడు. ‘బాహుబలి’లో శ్రీదేవి చేయకపోవడానికి కారణం ఆమె భర్త బోనీ కపూర్ అని అతను చెప్పాడు. నిజానికి శ్రీదేవి ‘బాహుబలి’లో నటించడానికి సుముఖంగానే ఉందని వర్మ వెల్లడించాడు. ఈ సినిమాలో చేయడంపై తాను కూడా శ్రీదేవితో మూడు నాలుగుసార్లు చర్చించానని.. ఐతే ఆసక్తితోనే కనిపించారని.. ఐతే బోనీ కపూరే ఈ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం ద్వారా బాహుబలి మేకర్స్ వెనక్కి తగ్గేలా చేశాడని.. అలా ‘బాహుబలి’లో శ్రీదేవి నటించకపోవడానికి బోనీనే కారణమయ్యాడని వర్మ అన్నాడు. బోనీ నిర్ణయాల వల్లే శ్రీదేవి కెరీర్ పరంగానూ చాలా నష్టపోయారని.. పెళ్లి తర్వాత శ్రీదేవి ఒక్క రోజు కూడా ఆనందంగా లేదని వర్మ వ్యాఖ్యానించడం విశేషం. తాను ఇష్టపడ్డ శ్రీదేవి బోనీకి రెండో భార్యగా వెళ్లడంపై వర్మ పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.