Begin typing your search above and press return to search.
బెజవాడ నడిరోడ్డుపై వర్మ వీరంగం?
By: Tupaki Desk | 28 April 2019 4:25 AM GMTవిజయవాడ నడి రోడ్డుపై రామ్‌గోపావల్ వర్మ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారా? అంటే అవుననే సమాచారం. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయాల నేపథ్యంలో వర్మ రూపొందించిన `లక్ష్మీస్ ఎన్టీఆర్` రిలీజై డైలమా గురించి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎన్నికలకు ముందు ఏపీలో విడుదల చేయాలని వర్మ ప్రయత్నించినా సీఎం చంద్రబాబు నాయుడు ఆ ప్రయత్నాలకు గండికొట్టి విడుదలను తాత్కాలికంగా వాయిదా వేయించారు. దీంతో ఏపీలో `లక్ష్మీస్ ఎన్టీఆర్` విడుదల ఇక లేనట్టేనని అంతా భావించారు. వర్మ కూడా సైలెంట్‌గా `కోబ్రా` సినిమా పనుల్లో బిజీ అయిపోవడంతో అంతా మర్చిపోయారు. అంత తేలిగ్గా ఏదీ వదిలిపెట్టే స్వభావం లేని వర్మ మే 1న `లక్ష్మీస్ ఎన్టీఆర్` చిత్రాన్ని ఏపీలో విడుదల చేస్తున్నామంటూ ప్రకటించారు.
దీంతో మళ్లీ రచ్చ మొదటికే వచ్చిందని తెలుస్తోంది. ఆదివారం ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ని విజయవాడ- నోవాటెల్ హోటల్‌లో ప్లాన్ చేశారు. అయితే చివరి నిమిషంలో ఆ హోటల్ యాజమాన్యం వర్మ ప్రెస్ మీట్ ని నిరాకరించి పెద్ద షాకే ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు మరో హోటల్ ని బుక్ చేసుకోవడం అంత ఈజీ కాదు. అందునా చంద్రబాబు ప్రభావం ఎక్కువగా వుండే విజయవాడలో కష్టమేనని ఆయన ఆందోళన అట. తాజాగా వర్మ ట్విట్టర్ వేదికగా రెచ్చిపోయారు. ఇదంతా సీఎం చంద్రబాబు నాయుడు పనే అంటూ వర్మ వీరంగం వేయడం ప్రస్తుతం చర్చకు వచ్చింది.
``లక్ష్మీస్ ఎన్టీఆర్` ప్రెస్ మీట్ ని విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో నిర్ణయించాం. అయితే ఆ హోటల్ వారికి ఎవరో వార్నింగ్ ఇవ్వడంతో క్యాన్సిల్ చేశారు. ఈ పరిమిత పరిస్థితుల్లో ట్రై చేసినా అన్ని హోటళ్లు - క్లబ్బుల వాళ్లు మనకు తెలిసిన ఓ వ్యక్తికి జడిసి పారిపోయారు. అందుకే ఎన్టీఆర్ సర్కిల్ రోడ్డులో సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ పెడుతున్నాను. మీడియా మిత్రులకి - ఎన్టీఆర్ నిజమైన అభిమానులకి - నేనంటో ఎంతో కొంత అభిమానం వున్న వారికి ఇదే నా ఆహ్వనం` అని ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.